మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ లార్డ్‌ ‘ఎల్‌ మయో’ అరెస్ట్‌ | Mexican Drug Kingpin El Mayo And El Chapo Son Arrested In US Drug Crackdown, See Details Inside | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ లార్డ్‌ ‘ఎల్‌ మయో’ అరెస్ట్‌

Published Fri, Jul 26 2024 8:22 AM | Last Updated on Fri, Jul 26 2024 12:47 PM

Mexican El Mayo And El Chapo Son Arrested In US

ఆస్టిన్‌: అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, మెక్సికో డ్రగ్‌ లార్డ్‌ ఇజ్మాయెల్‌ ‘ఎల్‌ మయో’ జాంబాదా(76) ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యాడు. టెక్సాస్‌ ఎల్‌పాసోలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఎల్‌ మయోతో పాటు మరో డ్రగ్‌ కింగ్‌పిన్‌ అయిన ఎల్‌ చాపో కొడుకు లిటిల్‌ చాపోస్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్‌ విమానంలో దిగిన వెంటనే ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్‌ మయోతో పాటు వాకిన్‌ ‘‘ఎల్‌ చాపో’’ గుజ్‌మన్‌ కొడుకు, సినాలోవా కార్టెల్‌ డ్రగ్స్‌ మాఫియాకే చెందిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌ చాపోతో కలిసి మెక్సికో కులియాకాన్‌ సిటీలో డ్రగ్స్‌ సామ్రాజ్యం సినాలోవా కార్టెల్‌  స్థాపించాడు జాంబాదా. ఇది తర్వాతి కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నేరసామ్రాజ్యంగా మారింది. అత్యంత ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’‌ డ్రగ్స్‌ తయారీ, ఇతర దేశాలకు అక్రమ రవాణా, మరణాలకు కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు జాంబాదాపై ఉన్నాయి.

మరోవైపు.. అమెరికాలో 18-45 మధ్య వయస్కులు వందల సంఖ్యలో ‘ఫెంటానిల్’ బారినపడి మరణించారు. అమెరికా లక్ష్యంగా జాంబాదా డ్రగ్స్‌ రాకెట్‌ నడిపించాడని, తమ దేశ పౌరుల మరణాలకు కారణమయ్యాడని ఆ దేశ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరాభియోగాలు చేశారు. ఇప్పటికే ఎల్‌ చాపో(67) కొలరాడో జైల్‌లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అతని నలుగురు వారసులు లిటిల్‌ చాపోస్‌(నలుగురికీ ఒకే పేరు) ఆ డ్రగ్స్‌ దందాను కొనసాగిస్తున్నారు. ఎల్‌ మయో, ఎల్‌ చాపో కొడుకు అరెస్ట్‌ కావడంతో అల్లర్లు జరగవచ్చని అమెరికా అప్రమత్తం చేయడంతో.. కులియాకాన్‌ అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement