kingpins arrested
-
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ‘ఎల్ మయో’ అరెస్ట్
ఆస్టిన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మెక్సికో డ్రగ్ లార్డ్ ఇజ్మాయెల్ ‘ఎల్ మయో’ జాంబాదా(76) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. టెక్సాస్ ఎల్‌పాసోలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఎల్ మయోతో పాటు మరో డ్రగ్ కింగ్‌పిన్ అయిన ఎల్ చాపో కొడుకు లిటిల్ చాపోస్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రైవేట్ విమానంలో దిగిన వెంటనే ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ మయోతో పాటు వాకిన్ ‘‘ఎల్ చాపో’’ గుజ్మన్ కొడుకు, సినాలోవా కార్టెల్ డ్రగ్స్ మాఫియాకే చెందిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎల్ చాపోతో కలిసి మెక్సికో కులియాకాన్ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం సినాలోవా కార్టెల్ స్థాపించాడు జాంబాదా. ఇది తర్వాతి కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నేరసామ్రాజ్యంగా మారింది. అత్యంత ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’ డ్రగ్స్ తయారీ, ఇతర దేశాలకు అక్రమ రవాణా, మరణాలకు కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు జాంబాదాపై ఉన్నాయి.మరోవైపు.. అమెరికాలో 18-45 మధ్య వయస్కులు వందల సంఖ్యలో ‘ఫెంటానిల్’ బారినపడి మరణించారు. అమెరికా లక్ష్యంగా జాంబాదా డ్రగ్స్ రాకెట్ నడిపించాడని, తమ దేశ పౌరుల మరణాలకు కారణమయ్యాడని ఆ దేశ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరాభియోగాలు చేశారు. ఇప్పటికే ఎల్ చాపో(67) కొలరాడో జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని నలుగురు వారసులు లిటిల్ చాపోస్(నలుగురికీ ఒకే పేరు) ఆ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. ఎల్ మయో, ఎల్ చాపో కొడుకు అరెస్ట్ కావడంతో అల్లర్లు జరగవచ్చని అమెరికా అప్రమత్తం చేయడంతో.. కులియాకాన్ అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
-
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ ఎంసెట్-2 (2016) మెడికల్ పేపర్ల లీకేజి కేసులో ప్రధాన సూత్రధారులు శివబహదూర్ సింగ్, అనూప్ కుమార్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో అరెస్టు చేసిన వీళ్లిద్దరినీ ట్రాన్సిట్ వారంటు మీద హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలంగాణ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్ అలియాస్ పండిట్ ప్రధాన సూత్రధారి. తనకున్న పరిచయాలతో అతడు తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్‌ను బయటకు తీసుకొచ్చాడు. 2005 నుంచి అతడు ఈ తరహాలో వివిధ పేపర్లు లీక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు లక్నోలో రైల్వే గ్రూప్-డి పేపర్ లీకేజి కేసు, 2008లో అలహాబాద్‌లో రైల్వే డ్రైవర్స్ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2015లో పంజాబ్‌లో టీఈటీ పరీక్ష లీకేజి కేసు, పీఎస్సీ పరీక్ష లీకేజికి సంబంధించి రెండు కేసులు, 2015లోనే జమ్ము కశ్మీర్ టీచర్ల ప్రవేశపరీక్ష లీకేజి కేసు, కోల్ ఇండియా కేసు, మహారాష్ట్రలో వార్ధా మెడికల్ కాలేజి పేపర్ లీకేజి కేసు, చండీగఢ్ టీచర్ల ప్రవేశ పరీక్ష కేసు, కోల్‌కతా టీఈటీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2016 డిసెంబర్లో డీఎంఆర్సీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, చివరగా 2016లో తెలంగాణ మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్ లీకేజి కేసు ఇతడి మీద ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలలో అనూప్ కుమార్ సింగ్ ఇతడికి సహాయకుడిగా ఉండేవాడని పోలీసులు తెలిపారు.