
ఐస్‌నీళ్లు కుమ్మరించుకుంటే ఏమొస్తుంది?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ సవాల్ హల్‌చల్ చేస్తోంది. అదే ‘ఐస్ బకెట్ చాలెంజ్’. అమియోట్రాఫిక్ లాటరల్ స్లెరోసిస్ (ఎఎల్‌ఎస్) అనే వ్యాధిపై అవగాహన కలిగించడానికి యూకేలో ఎఎల్‌ఎస్ సంస్థ
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ సవాల్ హల్‌చల్ చేస్తోంది. అదే ‘ఐస్ బకెట్ చాలెంజ్’. అమియోట్రాఫిక్ లాటరల్ స్లెరోసిస్ (ఎఎల్‌ఎస్) అనే వ్యాధిపై అవగాహన కలిగించడానికి యూకేలో ఎఎల్‌ఎస్ సంస్థ ఈ సవాల్‌ని ప్రవేశపెట్టింది. ఒక బకెట్ ఐస్‌నీళ్లు నెత్తి మీద కుమ్మరించుకుంటే ఈ సవాల్‌ని జయించినట్లు. ఇది విజయవంతంగా పూర్తి చేస్తే పది డాలర్లు, చేయలేనివాళ్లు వంద డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బుని ఎఎల్‌ఎస్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం వినియోగిస్తారు.
ఓ సత్కార్యం చేయడానికి సరదాగా ప్రవేశపెట్టిన ఈ సవాల్‌ని చాలామంది నిజంగా సరదా కోసం చేస్తున్నారు తప్ప, విరాళం ఇవ్వాలనే ఆకాంక్షతో చేయడంలేదు. ఇలాంటివారి గురించేనేమో ఇలియానా తన ట్విట్టర్‌లో ‘‘నెత్తి మీద ఐస్‌నీళ్లు కుమ్మరించుకుంటే ఏం లాభం? ఎఎల్‌ఎస్ సంస్థకు విరాళం ఇవ్వడానికి, ఆ వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తే ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్ప సరదాగా తీసుకోవాల్సిన విషయం కాదు’’ అని పేర్కొన్నారు.