లెమన్ ఫేస్ ఛాలెంజ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ లాగా ఇప్పుడు ‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’ సంచలనం సష్టిస్తోంది. ఇందులో చేయాల్సిందల్లా సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదా మిత్ర బందంతో కలిసి ఛాలెంజ్ చేయవచ్చు.
డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్ ఆర్మీ’ ఈ ఛాలెంజ్‌ను సృష్టించిందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది అమెరికా పోస్ట్’ పత్రిక వెల్లడించింది. గుడ్‌మార్నింగ్ బ్రిటన్స్ రిపోర్టర్ అరెక్స్ బెరెస్‌ఫోర్డ్ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తన రియాక్షన్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఛాలెంజ్ స్వీకరించడం మరి ఇంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment