uppena movie jr ntr voice over trailer - Sakshi
Sakshi News home page

ఉప్పెన: జూనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌!

Published Wed, Feb 3 2021 8:34 PM | Last Updated on Thu, Feb 4 2021 11:10 AM

Uppena Movie: Jr NTR Voice Over For Trailer - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం "ఉప్పెన". కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట. మొత్తానికి వైష్ణవ్‌ సినిమా రిలీజ్‌ అవకముందే అందరి నుంచి సపోర్ట్‌ అందుతోంది. (చదవండి: ‘వీడు ముసలోడు అవ్వకూడదే’)

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఎంత హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలర్‌ట్యూన్లు, రింగ్‌టోన్లు ఎక్కడా చూసినా ఈ పాటలే మార్మోగిపోయాయి. మరీ ముఖ్యంగా 'నీ కన్ను నీలి సముద్రం..' పాట సంగీత సముద్రంలో అందరితో పడవ ప్రయాణం చేయించింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తైన ఈ చిత్రం వాలంటైన్స్‌ డేకు రెండు రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. మరి పాటలను ఆదరించిన ప్రేక్షకులు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. (చదవండి: మహేశ్‌తో స్పెషల్‌ సాంగ్‌: మోనాల్‌ క్లారిటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement