Vaishnav Tej Uppena Success Meet: Chiranjeevi And Allu Arjun Attends For Celebrations - Sakshi
Sakshi News home page

ఉప్పెన సక్సెస్‌ పార్టీ.. మెగాస్టార్‌, బన్నీ సందడి

Published Sat, Mar 20 2021 2:44 PM | Last Updated on Sat, Mar 20 2021 3:27 PM

Chiranjeevi And Allu Arjun Attend Success Party Of Uppena - Sakshi

వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టీ జంటగా నటించిన ‘ఉప్పెన’ సినిమా రిలీజ్‌  అయ్యి నెల దాటినా మూవీపై క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాకు చెందిన ఏదో ఒక విషయం రోజూ వార్తల్లో నానుతుంది. ఇటీవల‌ ‘జలజల జలపాతం నువ్వు’ అంటూ సాగే వీడియో పాటను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఉప్పెన సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో చిత్రయూనిట్‌తోపాటు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, పాటు అల్లు అర్జున్‌, సాయి‌ తేజ్‌, సుకుమార్, హరీష్‌ శంకర్‌, గోపిచంద్‌ మలినేని, ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, త‌దిత‌రులు వేడుకలో సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా ‘ఉప్పెన’ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన సంగీతం, శ్రీ‌మ‌ణి రాసిన పాట‌లు సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు.  మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టించింది. ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. 

చదవండి:
ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్‌..
‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్‌ సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement