Krithi Shetty Birthday Special: Krithi Shetty Interesting Unknown Facts And Photos - Sakshi
Sakshi News home page

Happy Birthday Krithi Shetty: అందానికే అసూయ పుట్టించే అందం ‘బేబమ్మ’సొంతం

Published Tue, Sep 21 2021 5:01 PM | Last Updated on Wed, Sep 21 2022 3:38 PM

Happy Birthday Krithi Shetty: Krithi Shetty Beautiful Pics And Interesting Facts - Sakshi

టాలీవుడ్‌లోకి ప్రతి ఏడాది చాలామంది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అలా చడీచప్పుడు లేకుండా వచ్చి యువత గుండెల్లో అలజడులు రేపింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి. ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రాల్లో రిలీజైన ఒకే​ ఒక్క చిత్రం ‘ఉప్పెన’. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ఈ చిత్రంలో ‘బేబమ్మ’గా నటించిన  కృతిశెట్టి.. తొలి మూవీతోనే  తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఈ రోజు బేబమ్మ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె అందమైన ఫోటోలు మీకోసం.


నితిన్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం  ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.


సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌. 


కృతిశెట్టి బర్త్‌డే సందర్భంగా  ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీమ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసిం


నాని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.


రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.


అందానికికే అసూయ పుట్టించే అందం కృతిశెట్టి సొంతం


చడీచప్పుడు లేకుండా వచ్చి యువత గుండెల్లో అలజడుల సుడిగుండాలను రేపిందీ ముద్దుగుమ్మ


ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది


  ’ఉప్పెన’ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది ఈ కన్నడ బ్యూటీ


టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement