మెగా హీరో సినిమాకు మహేష్‌ సాయం.. | Mahesh babu To Release Uppena Movie 3rd song On Nov 11 | Sakshi
Sakshi News home page

మహేష్‌ చేతుల మీదుగా ‘ఉప్పెన’ పాట విడుదల

Published Thu, Nov 5 2020 10:17 AM | Last Updated on Thu, Nov 5 2020 12:09 PM

Mahesh babu To Release Uppena Movie 3rd song On Nov 11 - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో వైష్ణవ్‌ హీరోగా పరిచయం కానున్నారు. కీర్తీ శెట్టి ఫీమెల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంతో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. చదవండి: గాజులు ఘల్లుమన్నవే

కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా ఇవి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్‌ దక్‌ దక్‌’ పాట కూడా అంతే హిట్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నారు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా. ఉప్పెన సినిమాలోని ‘రంగులద్దుకున్న’ అనే పాటను మహేష్‌ బాబు నవంబర్‌ 11న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉండనుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement