మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశాడు.
‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి, సుకుమార్ గారికి, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్‌కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు.
ఇక పాట విషయానికొస్తే.. ఇదొక మెలోడీ సాంగ్. ‘రంగులద్దుకున్నా తెల్లరంగులవుదాం. పూలు కప్పుకున్నా కొమ్మలల్లె ఉందాం..’ అంటూ ప్రకృతి అందాల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందిచగా,యాజిన్ నిజర్, హరిప్రియ ఆలపించారు. ఈ పాటను దివంగత గానగంధర్వుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు.
కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా140 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ మూడో పాట ఎన్ని వ్యూస్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment