‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు | Nee Kannu Neeli Samudram Melody Song From Uppena Movie Create Record In Youtube | Sakshi
Sakshi News home page

‘ఉప్పెన’ తొలిప్రేమ పాట.. రికార్డు 

Published Tue, May 12 2020 12:38 PM | Last Updated on Tue, May 12 2020 1:11 PM

Nee Kannu Neeli Samudram Melody Song From Uppena Movie Create Record In Youtube - Sakshi

సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ఈ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. కాగా ఈ చిత్రంలోని తొలి ప్రేమ పాట ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’ సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. 


ప్రతీ ఒక్క ప్రేమజంటను మైమపరిపిస్తున్న ఈ సాంగ్‌ మరో రికార్డును అందుకుంది. తాజాగా ఈ వీడియో యూట్యూబ్‌లో 50 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అతితక్కువ సమయంలో 50 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన పాటగా ‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈ పాటకు ఉన్న క్రేజ్‌ బట్టి మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకోగా.. రక్వీబ్‌ ఆలమ్‌ హిందీ లిరిక్స్‌ మైమరిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. 



చదవండి:
శుభ‌శ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు
చైతూతో కలిసి సాహ‌స‌యాత్ర‌కు స‌మంత‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement