Mahesh Babu Review On Uppena: Movie Team Wins Hearts From Superstar - Sakshi
Sakshi News home page

‘ఉప్పెన’ ఎలా ఉందో ఒకే ముక్కలో తేల్చేసిన మహేశ్‌

Published Tue, Feb 23 2021 10:36 AM | Last Updated on Tue, Feb 23 2021 12:16 PM

Mahesh Babu Review On Uppena Movie - Sakshi

ఉప్పెన సినిమాకు పని చేసిన వాళ్లలో ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా అభినందిస్తూ మహేశ్ ట్వీట్ చేశాడు

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై అద్భత విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమాపై ఇప్పటికే  బాలయ్య మొదలు చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ జాబితాలో తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ కూడా చేరాడు. ఇటీవల ‘ఉప్పెన’ సినిమాను వీక్షించిన మహేశ్‌.. ఇదో అద్భుత సినిమా అంటూ చిత్ర యూనిట్‌ని కొనియాడాడు. ఉప్పెన సినిమాకు పని చేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

‘ఉప్పెన.. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్! బుచ్చిబాబు సానా.. మీరు కలకాలం గుర్తుండిపోయే అరుదైన చిత్రాన్ని రూపొందించారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’, ‘కొత్త వాళ్లైన వైష్ణవ్‌, కృతిశెట్టి అద్భుత నటన నా మనసును హత్తుకుంది’, ‘ఉప్పెనకు హార్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు అందించిన సంగీతంలో ఇది అత్యుత్తమం డీఎస్పీ. ఇలానే మంచి మ్యూజిక్ అందిస్తూ ఉండండి’, ‘ఇక చివరిగా ఉప్పెన లాంటి సినిమాను నిర్మించిన సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి హ్యాట్సాఫ్. నేను చెప్పినట్టుగా ఇది కలకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది’అని ట్విటర్‌ వేదికగా ఉప్పెన టీంను ప్రశంసించాడు. ఇక సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ప్రశంసతో ఉప్పెన టీం గాల్లో తేలిపోతుంది.


చదవండి :
‘ఉప్పెన’ మూవీ రివ్యూ 
డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్‌ప్రైజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement