
మొదటి సినిమాలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా అందరినీ ఆకట్టుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే వెండితెరపై హీరోయిన్‌గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ ముంబై చిన్నది.. టాలీవుడ్‌కు కొత్తేమో గానీ కెమెరాకు మాత్రం కొత్త కాదు. చిన్న వయసులోనే పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిందీ అమ్మడు.
ఓ క్లాతింగ్(వస్త్రాలకు సంబంధించిన) యాడ్‌తో పాటు ‘లైఫ్‌బాయ్’, ‘డైరీమిల్క్ చాక్లెట్’ తదితర కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. అంతేగాక ఓ ప్రముఖ కంపెనీకి చెందిన పెన్నుల యాడ్‌లో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఇక రెండేళ్ల క్రితం హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ 30 సినిమాలోనూ కృతి ఓ సన్నివేశంలో తళుక్కుమంది. ఈ నేపథ్యంలో బాల్యంలోనే కెమెరా ముందుకు వచ్చిన అనుభవంతోనే, హీరోయిన్‌గా తొలి సినిమాలోనే మంచి ప్రదర్శన కనబరిచి అందరి చేతా శభాష్ అనిపించుకుంటోందంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కృతిశెట్టి వాణిజ్య ప్రకటనలపై ఓ లుక్కేయండి మరి!
Comments
Please login to add a commentAdd a comment