ఉప్పెన భామకు కలిసిరాని కోలీవుడ్‌.. అందుకేనా ఈ పాట్లు! | Uppena Fame Krithi Shetty Social Media Post Goes Viral | Sakshi
Sakshi News home page

Krithi Shetty: కోలీవుడ్‌లో కృతిశెట్టి.. ఈ సారైనా హిట్‌ కొడుతుందా?

Published Tue, Jun 11 2024 12:38 PM

Uppena Fame Krithi Shetty Social Media Post Goes Viral

ప్రస్తుతం నటీనటులకు పబ్లిసిటీకి సోషల్ మీడియానే వేదికగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాతోనే క్రేజ్‌ తెచ్చుకుంటున్నారు. తమ అందమైన ఫొటోలను, తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఉప్పెన భామ కృతిశెట్టి  ప్రస్తుతం అదేబాటలో నడుస్తోంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ వయసు ఇప్పుడు కేవలం 20 ఏళ్లే. అయినప్పటికీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ చిన్నది 16 ఏళ్ల వయసులోనే సూపర్‌ 30 అనే హిందీ చిత్రం ద్వారా నాయకిగా రంగప్రవేశం చేశారు.

ఆ తరువాత తెలుగులో ఉప్పెన అనే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నారు. దీంతో ఈమె రాత్రికి రాత్రే క్రేజీ నటి అయిపోయారు. అలా కొన్ని చిత్రాల్లో నటించిన కృతిశెట్టికి అక్కడ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో కోలీవుడ్‌పై కన్నేశారు. అయితే ఇక్కడ ఇంకా సరైన విజయాన్ని అందుకోలేదు. తమిళ దర్శకుడు లింగుసామి, టాలీవుడ్ హీరో రామ్‌ హీరోగా తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ది వారియర్‌తో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టికి ఆ చిత్రం నిరాశపరచింది. అదేవిధంగా నాగచైతన్య హీరోగా మరో తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు తెరకెక్కించిన కస్టడి చిత్రంలోనూ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఆమె కేరీర్‌కు ఉపయోగపడలేదు.

అయితే కోలీవుడ్‌లో ఈమెకు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీకి జంటగా వా వాద్ధియార్, ప్రదీప్‌ రంగనాథన్‌ సరసన ఎల్‌ఐసీ, జయంరవికి జంటగా జీనీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క చిత్రం హిట్‌ అయినా, కృతిశెట్టి కోలీవుడ్‌లో పాగా వేసినట్లే. ఈమె కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిసింది. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచార ప్రయత్నాలు చేయడం మాత్రం ఆపలేదు. ఇటీవల కృతీశెట్టి పూర్తిగా ముత్యాలు పొదిగిన దుస్తులు ధరించి సొగసులను ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ చేయించుకున్నారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్‌ హిట్‌ కోసం పాట్లు అంటూ  జోరుగా కామెంట్స్‌ చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement