ఉప్పెన రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. థియేటర్లలో సందడి! vaishnav Tej Starrer Uppena Release date Announced | Sakshi
Sakshi News home page

ఉప్పెన రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Tue, Jan 26 2021 6:27 PM | Last Updated on Tue, Jan 26 2021 7:46 PM

vaishnav Tej Starrer Uppena Release date Announced - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. కీర్తీ శెట్టి ఫీమెల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన ఉప్పెన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా  ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్‌ దక్‌ దక్‌’ పాట కూడా అంతే హిట్‌ అయ్యింది. చదవండి: ‘ఉప్పెన’టీజర్‌పై రామ్‌చరణ్‌ ఆసక్తికర ట్వీట్‌

తాజాగా ఈ సినిమా యూనిట్‌ అభిమానులకు శుభవార్తనందించింది. ఉప్పెనను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. దీంతో సినిమా అభిమానులు ఆనందంతో మునిగి తేలుతున్నారు. కాగా షిబ్రవరి 19న నితిన్‌ నటించిన చెక్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కంటే ముందే ఉప్పెన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఉప్పెనలోని పాటలు, టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. హీరోగా వైష్ణవ్‌ తేజ్‌కు ఇది మొదటి సినిమా కావడంతో అతనికి ఎంత వరకు విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌: రాజమౌళి కాపీ కొట్టారట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement