పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ఆదికేశవ’.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్, కెమెరా: డడ్లీ.
ఆగస్టులో ఆదికేశవ
Published Sat, Jul 8 2023 3:58 AM | Last Updated on Sat, Jul 8 2023 3:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment