What Is The Reason Behind Krithi Shetty Bold Photoshoot, Is She Ready For Glamour Roles? - Sakshi
Sakshi News home page

Krithi Shetty: బేబమ్మ కాదు.. ఛాన్స్ వస్తే అంతకు మించి!

Published Tue, Jul 4 2023 3:23 PM | Last Updated on Tue, Jul 4 2023 3:59 PM

Krithi Shetty Ready Glamorous Roles - Sakshi

'ఉప్పెన' సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హీరోయిన్ కృతిశెట్టినే. తొలి చిత్రంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆ ఫామ్ ని కొనసాగించలేకపోయింది. పలు సినిమాల్లో చేసినప్పటికీ అవి చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. దీంతో కృతిశెట్టి కెరీర్ ఢమాల్ అయిపోయే దశకు వచ్చేసినట్లు కనిపించింది. దీంతో బేబమ్మ ఆలోచనలో పడిపోయింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!)

'ఉప్పెన'లో కాలేజీ స్టూడెంట్ గా నటించిన కృతిశెట్టి.. సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ప్రేక్షకుల మనసు దోచేసింది. కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది. తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయలేదు. 'శ్యామ్ సింగరాయ్'లో మాత్రం నానితో లిప్‌కిస్ సీన్ చేసింది. ఆ సినిమా ఫెయిల్ కావడంతో కృతిశెట్టికి అది పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనే హింట్ ఇస్తోంది. అందుకే ప్రస్తుతం ఫొటోషూట్స్ తో రెచ్చిపోతుంది.

మలయాళంలో టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఓ పీరియాడికల్ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా చేస్తోంది. శర్వానంద్ తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఇకపై మాత్రం ఇలా కాకుండా స్కిన్ షో, లిప్ లాక్ సీన్లకు అస్సలు అడ్డుచెప్పకూడదని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. అందుకే తన హాట్ ఫొటోషూట్స్ తో దర్శకనిర్మాతలకు పరోక్షంగా హింట్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి కృతి విషయంలో ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: మహేశ్‌నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో)




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement