Custody Movie
-
బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?
'ఉప్పెన' సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హీరోయిన్ కృతిశెట్టినే. తొలి చిత్రంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆ ఫామ్ ని కొనసాగించలేకపోయింది. పలు సినిమాల్లో చేసినప్పటికీ అవి చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. దీంతో కృతిశెట్టి కెరీర్ ఢమాల్ అయిపోయే దశకు వచ్చేసినట్లు కనిపించింది. దీంతో బేబమ్మ ఆలోచనలో పడిపోయింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!) 'ఉప్పెన'లో కాలేజీ స్టూడెంట్ గా నటించిన కృతిశెట్టి.. సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ప్రేక్షకుల మనసు దోచేసింది. కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది. తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా ఎక్స్పోజింగ్ చేయలేదు. 'శ్యామ్ సింగరాయ్'లో మాత్రం నానితో లిప్‌కిస్ సీన్ చేసింది. ఆ సినిమా ఫెయిల్ కావడంతో కృతిశెట్టికి అది పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనే హింట్ ఇస్తోంది. అందుకే ప్రస్తుతం ఫొటోషూట్స్ తో రెచ్చిపోతుంది. మలయాళంలో టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఓ పీరియాడికల్ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా చేస్తోంది. శర్వానంద్ తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఇకపై మాత్రం ఇలా కాకుండా స్కిన్ షో, లిప్ లాక్ సీన్లకు అస్సలు అడ్డుచెప్పకూడదని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. అందుకే తన హాట్ ఫొటోషూట్స్ తో దర్శకనిర్మాతలకు పరోక్షంగా హింట్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి కృతి విషయంలో ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతీ శెట్టి కథానాయికగా నటించిన చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారి పోలీసాఫీసర్‌గా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే అండర్‌వాటర్ యాక్షన్ సీన్, ట్రైన్ ఫైట్, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ సీన్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. శరత్ కుమార్, ప్రియమణి, అరవింద స్వామి తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. embark on a heart-pounding journey with constable Siva as he works his way through a web of corruption, betrayal, and lies! 👮♂#CustodyOnPrime, June 9 pic.twitter.com/oosDXGXjE8 — prime video IN (@PrimeVideoIN) June 7, 2023 చదవండి: రెండో పెళ్లిపై ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి -
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన 'బేబమ్మ'
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అక్కినేని నాగచైతన్యతో కలసి నటించిన 'కస్టడీ' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది కృతిశెట్టి. హీరోల్లో రామ్‌చరణ్, శివకార్తికేయన్ తన ఫేవరెట్ అని, ఆలియాభట్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ కాబోయేవాడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది. తన కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట ..అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట. మంచి మనసున్నవాడై ఉండాలట. మొహమాటం లేకుండా నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తపరచాలట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో చాలా సింపుల్‌గా ఉండాలట. అంతేకాకుండా కాస్త బొద్దుగా కూడా ఉంటే ఇంకా ఇష్టమని తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది కృతిశెట్టి. -
కస్టడీ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్లో కృతి శెట్టి..
-
ఆ మైండ్ సెట్ తో వెళ్తే కచ్చితంగా నచ్చుతుంది
-
ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్
‘‘రోటీన్‌గా కాకుండా కొత్తగా చేయాలని ‘కస్టడీ’ చేశాను’’ అన్నారు నాగచైతన్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘కస్టడీ’కి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ లభిస్తోంది. మేం నమ్మి చేసిన అండర్‌వాటర్ యాక్షన్ సీన్, పోలీస్ స్టేషన్లో సింగిల్ షాట్ ఫైట్, ట్రైన్ ఫైట్, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ సీన్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అన్నారు. ఈ చిత్రంలో నేను చేసిన రేవతి పాత్రకు మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కృతీ శెట్టి.‘‘వందశాతం మా కష్టం ఫలించిందని అనుకుంటున్నాను’’ అన్నారు వెంకట్ ప్రభు. ‘‘కస్టడీ’ బ్లాక్‌బస్టర్ అయి నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. -
ఓటీటీకి నాగచైతన్య 'కస్టడీ'.. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్!
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం 'కస్టడీ'. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. (ఇది చదవండి: అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్) అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై యావరేజ్ టాక్ రావడంతో త్వరలోనే ఓటీటీకి వచ్చేస్తుందని సినీప్రియులు భావిస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ రానుందని సమాచారం. ఎందుకంటే ఇటీవలే విడుదలైన రావణాసుర, శాకుంతలం సినిమాలు నెల ముందుగానే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Custody Review: ‘కస్టడీ’ మూవీ రివ్యూ) -
Custody Box Office Collection: ‘కస్టడీ’కి ఊహించని కలెక్షన్స్, ఎంతంటే..
నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. (చదవండి: కస్టడీ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఫలితంగా తొలి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. (చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్ ) ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు దాదాపు రూ.4 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో రూ.2.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. -
Custody Review: ‘కస్టడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కస్టడీ నటీనటుటు: నాగచైతన్య, అరవింద స్వామి, శరత్‌కుమార్, కృతీశెట్టి, ప్రియమణి, రామ్కీ, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి రచన- దర్శకుడు: వెంకట్ ప్రభు సంగీతం: ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కథిర్ ఎడిటర్: వెంకట్ రాజేన్ విడుదల తేది: మే 12, 2023 గతేడాది నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ, కీలక పాత్ర పోషించిన లాల్ సింగ్ చడ్డా..రెండూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ‘కస్టడీ’ చిత్రం చేశాడు. సాలిడ్ హిట్‌తో పాటు తమిళ్లో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ‘కస్టడీ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య నేడు (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? చైతూకి సాలిడ్ హిట్ లభించిందా?లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1990 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. శివ(నాగచైతన్య).. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఓ సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. ఓ సారి అంబులెన్స్‌కి దారి ఇప్పించడం కోసం ముఖ్యమంత్రి దాక్షాయణి(ప్రియమణి) కాన్వాయ్‌ని ఆపి వార్తల్లోకి ఎక్కుతాడు. శివకి డ్రైవింగ్ స్కూల్లో పనిచేసే రేవతి(కృతిశెట్టి) అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులాలు వేరుకావడంతో రేవతి ఫ్యామిలీ ఒప్పుకోదు. దీంతో ఇద్దరు కలిసి పారిపోదామనుకుంటారు. డ్యూటీ ముగించుకొని మరో కానిస్టేబుల్‌తో కలిసి రేవతి ఇంటకి వెళ్తున్న క్రమంలో ఓ కారు వచ్చి వీరి స్కూటర్ని గుద్దుతుంది. ఆ కారులో రాజు(అరవింద స్వామి), , సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) ఉంటారు. రాజు బాగా మద్యం సేవించి ఉండడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొస్తారు. విషయం తెలుసుకొని ఐజీ నటరాజన్(శరత్ కుమార్)తో సహా కొంతమంది రౌడీలో రాజుని చంపడానికి స్టేషన్‌కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు నేపథ్యం ఏంటి? అతన్ని చంపడానికి పోలీసులతో పాటు సీఎం దాక్షాయణి మనుషులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వారి నుంచి రాజుని రక్షించిన శివ.. బెంగళూరు ఎందుకు తీసుకెళ్లాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. వెంకట్ ప్రభు సినిమాల్లో స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. కథ పాతదే అయినా ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ఊహించని ట్విస్టులు ఉంటాయి. కస్టడీ చిత్రంలో వెంకట్ ప్రభు మ్యాజిక్ అంతగా వర్కౌట్ కాలేదు. అతని స్క్రీన్‌ప్లే మాయ కొన్ని చోట్ల మాత్రమే పని చేసింది. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే.. ఒక విలన్ని కాపాడడానికి హీరో ప్రయత్నించడం. విలన్ని రక్షించుకోవడం కోసం హీరో పడ్డ కష్టాలు ఏంటి అనేది ఈ సినిమా కథ. కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు నడిపించిన లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోలేదు. అరవింద్ స్వామి పాత్ర ఎంటర్ అయ్యాక కథ మొదలైయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత కథ కాస్త ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ సీరియస్‌గా సాగుతుంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేదే ముందే ఊహించొచ్చు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. దానికి తోడు స్లో నెరేషన్ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఎవరెలా చేశారంటే.. కానిస్టేబుల్ శివ పాత్రలో నాగచైతన్య ఒదిగి పోయాడు. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీశాడు. రేవతిగా కృతీశెట్టి ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక సినిమా మొత్తంలో అరవింద్ స్వామి పాత్రని బాగా హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అతనికి ఇచ్చే ఎలివేషన్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్లుగా క్యారెక్టర్ డెప్త్ లేదు. ఇక ముఖ్యమంత్రి దాక్షాయణిగా ప్రియమణి పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రకి బలమైన సన్నివేశాలు లేవు. పోలీసు ఉన్నతాధికారిగా శరత్ కుమార్ మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగానే చేశాడు. రాంకీ, జయసుధల పాత్రల నిడివి చాలా తక్కువ. ఆ పాత్రలకు ఇంతపెద్ద నటులు అవసరం లేదనిపిస్తుంది. హీరో అన్నయ్య విష్ణుగా జీవా, అతని ప్రియురాలుగా ఆనందితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా.. సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా మారాయి. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
నా గురించి రానా ఎందుకు అలా చెప్పాడో ఫోన్ చేసి కనుక్కోవాలి
-
చై నా ఫేవరెట్... కృతి శెట్టికి చైతన్య అంటే ఎంత ఇష్టమో చూడండి
-
నాగ చైతన్య, కృతి శెట్టి ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
విరూపాక్ష సక్సెస్ పై నాగచైతన్య ఊహించని కామెంట్స్
-
‘కస్టడీ’ మూవీ ట్వీటర్ రివ్యూ
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కస్టడీ’ సినిమా ఎలా ఉంది? కానిస్టేబుల్‌గా నాగచైతన్య ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. (చదవండి: ఆ విషయం ఓ సవాల్‌గా మారింది : నాగచైతన్య) ‘కస్టడీ’చిత్రానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. నటన పరంగా నాగచైతన్య, అరవింద స్వామి ఇరగదీశారని చెబుతున్నారు. అయితే కథ, కథనం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు ఆకట్టుకునేలా లేవని కామెంట్ చేస్తున్నారు. #Custody One Word Review: This movie has a 50-50 odds of winning at the box office but This gonna be a #NagaChaitanya memorable movie in his career. This remains to be one of the UNDERRATED Movie from tollywood if not recognized today. Mark my words 🔥#CustodyReview… pic.twitter.com/enUNpXNAOK — ReviewMama (@ReviewMamago) May 12, 2023 సినిమా నెమ్మదిగా మొదలై.. ప్రిడిక్టబుల్ నెరేషన్ తో సాగుతుందట ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50ః50 శాతం విజయం సాధించే అవకాశం ఉంది. కానీ నాగచైతన్య కెరీర్లో ఓ మెమరబుల్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Custody Overall a Below Par Action Thriller! Interesting plot point with a few well designed scenes that work but the rest is tiresome. Film is dragged in many places with repetitive actions scenes and narrated in a flat way. BGM is ok but songs are awful. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) May 11, 2023 కస్టడీ ఓవరాల్‌గా బిలో యావరేజ్ పార్ యాక్షన్ థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా సీన్స్ గత సినిమాల్లో చూసినట్టుగా ఉంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. కానీ పాటలు ఆకట్టుకోలేకపోయాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు. #Custody career best acting career best movie 3.789/5 — Vv (@babbar5her_) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody an excellent first half and good second half Overall a must watch movie - 3.25/5 👌 — AkkineniBOupdates (@AkkineniBO) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody First half police station scene 🔥🔥🥳 Second half forest fight 🔥🔥🔥 Kummaru — Toride (@Toride17Toride) May 12, 2023 Just Now Completed My show 🤩 1st Half average, 2nd Half Mathram 💥💥💥 Screenplay +BGM Mamuluga Undav 💥🥵🥵🥵 Chai acting Aithay Un expected💥 Overall ga Block Buster Kotesadu @chay_akkineni Anna 😍#Custody #NagaChaitanya pic.twitter.com/cSd29CzokA — Srinivas (@srinivasrtfan2) May 12, 2023 #CustodyFromTomorrow #CustodyOnMay12 #CustodyMovie #custody 1st half good. It wd have even more gripping but still good 1st half. Chay superb perf 👌 Vennela kishore hilarious 👌 Ilayaraja bgm creates nostalgia 🙏 https://t.co/wmcUQ0NYOk — BayArea MegaFan 💪 (@Twittarodu) May 12, 2023 -
సమంత బోల్డ్ సీన్స్ వల్లే విడాకులా? క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కస్టడీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగచైతన్య తాజాగా మరోసారి సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంతది చాలా కష్టపడే మనస్తత్వమని, ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందంటూ ప్రశంసలు కురిపించాడు. సమంత హార్డ్ వర్కర్. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. ఆమె నటించిన ఓ బేబీ, ది ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్ నాకు చాలా ఇష్టం. రీసెంట్గా యశోద కూడా చూశాను.ఇప్పటికీ సమంత చేసిన అన్ని సినిమాలు చూస్తాను అంటూ చై పేర్కొన్నాడు. కాగా చై-సామ్‌ల విడాకులకు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీసే కారణమని, అందులో సామ్ చేసిన బోల్డ్ సన్నివేశాల వల్లే వీరిద్దరికి గొడవలు వచ్చాయంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని ఇమేజ్‌కు విరుద్దంగా సమంత ఆ సినిమాలో చాలా బోల్డ్‌గా నటించిందని, అదే విడాకులకు దారితీసిందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా నాగచైతన్య కామెంట్స్‌తో అది కేవలం పుకారు మాత్రమేనని తేలిపోయింది. -
అక్కినేని ట్యాగ్‌లైన్ ఒత్తిడిగా ఉందా? చై ఆన్సర్ ఇదే
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నాగ చైతన్య ఇంటర్వ్యూ విశేషాలు. కస్టడీ అనేది సీరియస్ యాక్షన్ సినిమా కదా? మీకున్న ప్రజెంట్ మూడ్ ను షూటింగ్ లో ఎలా మ్యాచ్ చేసుకున్నారు. మీకనిపించిన ఛాలెంజ్ ఏమిటి? ప్రతి సినిమాకు రెండు నెలలు వర్క్ షాప్ చేస్తాను. క్యారక్టర్ ఎలావుండాలి అనేవి కథలోని కొన్ని సీన్స్ ను 5డి కెమెరాతో షూట్ చేస్తాం. ఈ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పరిశీలించాను. కొంతమంది ని కలిశాను కూడా. ఇలాంటివి కొంతమంది దర్శకులు ఎంకరేజ్ చేస్తారు. అలా వెంకట్ ప్రభు నాకు ప్రీడమ్ ఇచ్చారు. పోలీసు కానిస్టేబుళ్లను కలిశాక. వారి కష్టాలు విన్నాక నాకే ఇన్స్పయిరింగ్ గా అనిపించింది. అందుకే వారి కథలు చెప్పాలనుకున్నా. యాక్షన్ సినిమాలలో పోలీస్ పాత్రల్లో మీకు ఎవరు ఫేవరేట్? ఘర్షణ ఆల్ టైం. ఇక ఇంటర్నేషనల్ పరంగా జేమ్స్ బాండ్ 007 సినిమాలు అంటే ఇష్టం. మానాడు సినిమా తర్వాత ఈ సినిమా అనుకున్నారా? వెంకట్ ప్రభుగారి మానాడు సినిమాకు ముందే కస్టడీ కథ ఓకే అయింది. ఈ కథ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది, అందుకే చేశాను. వెంకట్‌ప్రభు గారి దర్శకత్వంలో సినిమా చేశాక ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారని అపిపిస్తుంది? నేను సినిమా చూశా. చాలా నమ్మకంతో వున్నా. ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో వారి తీర్పే ఫైనల్. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్ గా వుంటుంది. ఇలాంటి రోల్ నాకు కస్టడీలో వర్కవుట్ అయింది అనుకుంటా. ఈ సినిమా తర్వాత పూర్తి భిన్నమైన సినిమా చేయబోతున్నా. యాక్షన్ పార్ట్ చేసేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకున్నారు? యాక్షన్ సీన్స్ చాలా నాచురల్ గా వుంటాయి. ఫైట్ మాస్టర్లతో రిహార్సల్స్ చేశాక షూట్ కు వెళ్ళాం. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్ వాటర్ వంటి సీన్స్ వారితో చర్చించాక చేసినవే. కస్టడీ ట్రైలర్, టీజర్ లో అది మీకు కనిపిస్తుంది. మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తారు. అందుకే యాక్షన్ పార్ట్ చాలా కీలకం ఈ సినిమాలో. మీరు ఏ పాత్ర చేస్తున్నారు? నేను కానిస్టేబుల్‌గా నటించా. నా పాత్రపరంగా వెంకట్‌ప్రభుగారు చెప్పింది చెప్పినట్లు తీశారు. పూర్తి న్యాయం చేశాను. ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర ఇది. తెలుగు దర్శకులతో నటించారు. తమిళ దర్శకుడిలో మీరు గమనించిన వ్యత్యాసం ఏమిటి? ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. వెంకట్ప్రభుగారి స్క్రీన్‌ప్లే చాలా వెరైటీగా వుంటుంది. మానాడు అనే సినిమాలో చాలా కన్ఫ్యూజ్ పాయింట్ ను తేలిగ్గా చూపించేశారు. మెచ్చూర్డ్ డైరెక్టర్. సినిమా పూర్తయ్యాక దర్శకుడు చెప్పింది వచ్చిందనుకున్నారా? నాకు కథ ఏమి చెప్పారో అది తీశారు. మొన్ననే ఆర్.ఆర్. అన్నీ అయ్యాక థియేటర్ లో సినిమా చూశాను. మంచి సినిమా ఇవ్వబోతున్నామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఏ రేంజ్లో వుంటుందనేది ప్రేక్షకుల తీర్పును బట్టివుంటుంది. చేసిన సినిమాలలో తప్పొప్పులు గురించి ఆలోచిస్తారా? నటుడిగా నాకు నేనే తప్పులు వెతుకుతుంటాను. అదే నా ఇంప్రూవ్ మెంట్ కూడా. అరవింద్ స్వామి గారి నుంచి ఏం నేర్చుకున్నారు? అరవింద్‌గారికి స్క్రిప్ట్ పేపర్ ఏది ఇస్తారో దాన్ని ఓన్ గా తన శైలితో ఇంప్రూవ్ మెంట్ చేసుకుంటారు. పేకప్ అయ్యాక కూడా ఆ పాత్ర గురించే ఆలోచిస్తారు. నైట్ మెసేజ్ కూడా ఫలానా సీన్ గురించి ఇలా వుండాలంటూ చెబుతారు. కస్టడీలో పోలీసుగా ఫ్యాన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారు? నేను పర్టిక్యులర్ గా పలానా పాత్ర అనేది చేయను కథను బట్టి పాత్రను బేరీజు వేసుకుంటాను. లవ్ స్టోరీలు గతంలో చేశాను. కంటిన్యూ గా అవే చేస్తే నటుడిగా ఎదగలేను. చైతన్య ఎలాంటి కథలోని పాత్రనైనా బాగా చేస్తాడని అనిపించుకోవాలి. పోలీస్ పాత్ర యాంగ్రీగా వుంటుంది. అండర్ డాగ్ ప్లే చేయడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు? కానిస్టేబేల్ పాత్ర ఫస్టాఫ్ లో ఎంజాయ్ చేసేవిధంగా వుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సరికి కానిస్టేబుల్ గ్రోత్ మారుతూ వుంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది కూడా. నటి పరంగా కృతి శెట్టి లో మీరు గమనించింది ఏమిటి? ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించింది. నటిగా తను చాలా మెచ్యూర్డ్. తమిళం బాగా నేర్చుకుంది. మీరు తమిళ్ డబ్బింగ్ చెప్పారా? నటుడిగా వాయిస్ ముఖ్యం. అందుకే తమిళంలో నేను డబ్బింగ్ చెప్పాను. మొదట్లో చిన్న చిన్న లోపాలున్నా బాగానే చెప్పగలిగాను. కస్టడీ లాంటి అండర్ డాగ్ సినిమాలు గతంలో వచ్చాయి. అందులో మీకు ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ ఏవి? చాలా సినిమాలు వున్నాయి. నిర్మాతగారు మాట్లాడుతూ, నాగార్జునగారికి శివ ఎలాగో చైతన్యకు కస్టడీ అలాగ అన్నారు. మీరేమంటారు? నవ్వుతూ.. ఏ సినిమాకూ కస్టడీని కంపేర్ చేయవద్దు. నేను ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. అక్కినేని ఫ్యాన్స్ గొప్పగా ఫీలయేట్లు వుంటుందా? నూరు శాతం వారికి పాజిటివ్‌గా వుంటుంది. అక్కినేని అభిమానులకు మంచి సినిమా ఇచ్చాననే నమ్మకం నాకుంది. శరత్‌కుమార్, ప్రియమణి, అరవింద్ స్వామి ముగ్గురు ఉద్దండుల మధ్య నటించడం మీకెలా అనిపించింది? ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ముగ్గురి మధ్య నలిగిపోతాను. అదే సినిమాకు హైలైట్. అందుకే లుక్ పరంగా డిఫరెంట్ గా కనిపిస్తాను. సైజ్ కూడా తగ్గాను. ఫిట్ కానిస్టేబుల్ ఎలా వుంటాడో అలా మార్చుకున్నా. అక్కినేని కుటుంబ హీరోగా మీకు ఒత్తిడి ఏమైనా వుందా? నేను చేసే ప్రతి సినిమా ఛాలెంజ్ గా తీసుకుంటాను. ప్రతిరోజూ కష్టపడి పని చేస్తుంటాను. తాతగారు, నాన్నగారికి ఫ్యాన్స్ ఎలా అయ్యారంటే వారికంటూ ఒక శైలితో ఆకట్టుకున్నారు. అలాగే నేను, అఖిల్ కూడా స్వంత స్టయిల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాత శ్రీనివాస్ గారు భారీ బడ్జెట్ అయిందన్నారు? శ్రీనివాస్‌గారు చాలా ఓపెన్ గా వుంటారు. కథ విన్నారు. కనెక్ట్ అయ్యారు. ఫ్యాషనేట్ నిర్మాతగా ఈ సినిమా చేశారు. నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్ అన్నారు. దానిపై మీ స్పందన? ఆయన చాలా ఖర్చు పెట్టారు. నేను ఏ సినిమాలో చేయని యాక్షన్ సీన్స్ ఇందులో చేశాను. అందుకే ప్రొడక్షన్ పరంగా హయ్యస్ట్ సినిమా అవుతుంది. ఇళయరాజాగారిని ఎంచుకోవడానికి కారణం? ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అందుకే ఆ కాలానికి తగిన విధంగా ఇళయరాజా గారి వింటేజ్ వుంటుంది. అందుకే అడిగారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్. ఇళయరాజాగారు కొన్ని ట్రాక్స్ నోట్ ఇచ్చారు. దానిని యువన్ శంకరరాజా అద్భుతంగా చేశారు. అండర్ వాటర్ సీన్ ఎన్నిరోజులు చేశారు? నాలుగు రోజులు రిహార్సల్స్ చేశాం. మొత్తం 15రోజుల్లో షూట్ చేశాం. ఈ రోజుల్లో ప్రేక్షకుల ఆలోచనలు మారాయి? హీరోగా మీకేమనిపిస్తుంది? కరెక్టే. ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. వారం వారం హీరో ఫేట్ మారిపోతుంది. కొత్త కథలను వారు అంగీకరిస్తున్నారు. హీరోగా ప్రతి వారికి ఛాలెంజ్‌గా వుంటుంది. సక్సెస్ కు ఒక ఫార్ములా లేదు. సినిమా చేస్తున్నప్పుడే సక్సెస్ ఫెయిల్యూర్ తెలిసిపోతుందా? రెండే చోట్ల తెలిసిపోతుంది. కథను ఎంపికలోనూ, షూటింగ్ లోనూ తెలిసిపోతుంది. వాటిని సరి చేసుకుంటూ సినిమా చేయడమే ముందున్న కర్తవ్యం. కూల్ గా వుండే మీరు ఫెరోషియస్ పాత్ర ఎలా చేయగలిగారు? అది వృత్తిపరంగా చేస్తాం. కూల్ అనేది వ్యక్తిగతం. ఏ నటుడికైనా వర్క్‌షాప్ చాలా ఉపయోగపడుతుంది. అది నాకు ఉపయోగపడింది. దానివల్ల బడ్జెట్‌పరంగా నిర్మాత కొంత సేవింగ్ కనిపిస్తుంది. కస్టడీ2 వుంటుందా? ప్రేక్షకులు హిట్ చేస్తే తప్పకుండా చేస్తాం. అందరూ పాన్ ఇండియావైపు వెళుతున్నారు? తెలుగు, తమిళ ఆడియన్స్ నా టార్గెట్. -
కస్టడీ టీం ప్లానింగ్ అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిఫ్లెక్ట్ అయితే మాత్రం..
-
గాయపడ్డ మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది
-
అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్
నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. చదవండి: 14ఏళ్లుగా భోజనం చేయడం లేదు : బాలీవుడ్ నటుడు ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.తాజాగా ఈసినిమా నుంచి మరో క్రేజీ వీడియోను వదిలారు. అండర్ వాటర్‌లో చేసే యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు.కాగా ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
నాన్న శివ సినిమాకు కస్టడీ సినిమాకు కనెక్షన్..
-
శివలా ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది : శ్రీనివాసా చిట్టూరి
‘‘నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కస్టడీ’ సినిమా రూపొందింది. నాగార్జునగారి కెరీర్లో ‘శివ’ మూవీ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్లో ‘కస్టడీ’ అలా గుర్తుండిపోతుంది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతితో పాటు ఓ మంచి చిత్రం చూశామనే సంతృప్తిని ప్రేక్షకులకు ‘కస్టడీ’ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు–తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. (చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!) ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘మన తెలుగు దర్శకులు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో ‘వారియర్’, ‘కస్టడీ’ సినిమాలను తమిళ డైరెక్టర్స్‌తో తీశాను. ‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయాలనుకున్నాను.. అది ‘కస్టడీ’తో కుదిరింది. ఒక కానిస్టేబుల్ కథ ఇది. మంచి కథ, చక్కని స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, సీరియస్, ఎంటర్టైన్మెంట్తో కథ సాగుతుంది. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఈ కథ వినగానే ఇళయరాజాగారు, యువన్ సంగీతం అందిస్తామనడం హ్యాపీ. ఈ మూవీ హిట్టవుతుందనే నమ్మకంతోనే ‘కస్టడీ 2’ ఉంటుందని చెబుతున్నాం. నేను ‘యు టర్న్’ తీసేనాటికి సమంతగారి మార్కెట్ ఏంటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. అలాగే గోపీచంద్ ‘సీటీమార్’, రామ్ ‘వారియర్’, ఇప్పుడు నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాలు కూడా వారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమాలు. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. మా బ్యానర్లో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 90 శాతం పూర్తయింది. అలాగే నాగార్జునగారితో తీసే సినిమా షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించాలని అనుకుంటున్నాం’ అన్నారు. -
చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు
‘‘మలయాళం మూవీ ‘నాయట్టు’ స్ఫూర్తితో ‘కస్టడీ’ స్టోరీలైన్ రాసుకున్నాను. అయితే ‘నాయట్టు’లో కమర్షియల్ అంశాలు ఉండవు. ‘కస్టడీ’లో తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కమర్షియల్ అంశాలు ఉంటాయి’’ అన్నారు వెంకట్ ప్రభు. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకట్ ప్రభు చెప్పిన విశేషాలు. ►ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ శివ పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. శివకు ఉన్న ప్రాబ్లమ్స్‌తో ఈ సినిమా కథ మొదలవుతుంది. అతని కుటుంబం, ప్రేయసి వంటి అంశాలతో మొదటి ఇరవై నిమిషాలు గడుస్తాయి. కానీ తనది కాని సమస్యలో శివ ఇరక్కుంటాడు. కాలానికి వ్యతిరేకంగా పరిగెత్తాల్సి వస్తుంది. (చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్) ప్రీ ఇంట్రవెల్ నుంచి క్లయిమాక్స్ వరకూ ఆడియన్స్ ఈ సినిమాను ఆసక్తికరంగా చూస్తారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. రీసెంట్గా ‘కస్టడీ’ స్టోరీ లైన్ చెప్పేశాను. ఆ తర్వాత సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయవద్దని, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ను థియేటర్స్‌లో ఆడియన్స్ చూసి ఎగ్జయిట్ అయితే బాగుంటుందని చైతూ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. సో.. ఇంతకంటే ఏమీ చెప్పలేను. (చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?) ► యాక్టింగ్ పరంగా ఈ చిత్రంలో కొత్త చైతూను చూస్తారు. రేవతిగా కృతీ శెట్టి, రాజుగా అరవింద్ స్వామి, శరత్‌కుమార్‌ల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘కస్టడీ’ యూనివర్సల్ సబ్జెక్ట్. సబ్ టైటిల్స్‌తో ఇతర భాషలవారు ఈ సినిమాను చూస్తే వారికీ నచ్చుతుంది. ఇక ‘మానాడు’ సినిమాను తెలుగులో శ్రీనివాసా చిట్టూరిగారు నిర్మించాల్సింది కానీ కుదర్లేదు. అయితే ఆయనతో ఓ ప్రాజెక్ట్ చేయాలన్న ఆశ ‘కస్టడీ’తో తీరింది. ‘కస్టడీ’ సినిమాకు ఇళయరాజాగారు, యువన్ల సంగీతం చాలా పెద్ద ఎస్సెట్ ► నేను శివ సినిమాకి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు అందులో పాత్ర పేరు శివ అయినప్పుడు అదే పేరు పెట్టాలని అనుకున్నాను. అయితే చైతు వద్దు అని చెప్పారు. అది కల్ట్ క్లాసిక్. చాలా పోలికలు వస్తాయని అన్నారు. -
ప్రమాణం చేసి మరీ నిజాలు చెప్పిన ప్రియమణి
-
నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం: నాగచైతన్య
నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వారిద్దరి డివోర్స్ ఇష్యూపై మీడియాలో కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సైతం వీరి విడాకుల వ్యవహారంపై ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవి తనకు చాలా బాధను కలిగిస్తున్నాయని నాగచైతన్య అంటున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం కస్టడీ. ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచారు. అందలో సమంతతో విడాకుల తర్వాత తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. (చదవండి: వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ! ) ‘దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల సమంత, నేను విడిపోయాం. కానీ నా జీవితంలో సమంతతో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ గత రెండేళ్లుగా మీడియాలో ఈ విషయంపై వస్తున్న రూమర్స్ వల్ల ఆ గౌరవాన్ని తీసేస్తున్నారు. నా సినిమాల గురించి ఏం మాట్లాడినా ఓకే కానీ.. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బాధ కలుగుతుంది. మాకు కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాదిపైన అవుతుంది. ఇంకా ఇదే విషయాన్ని మీడియా సాగదీస్తుంది. మా ఇద్దరితో ప్రమేయం లేని మూడో వ్యక్తిని కూడా వార్తల్లోకి లాగుతున్నారు. వాళ్ల కుటుంబాలు ఎంత బాధ పడుతుందో ఆలోచించడం లేదు. కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. విడాకులపై నేను, సామ్ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాం. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను’అని చై చెప్పుకొచ్చాడు. -
ఆ రెసిపీ ఎవరికీ తెలియదు
‘‘నాకు షూటింగ్ లొకేషన్ హాలిడే స్పాట్లాంటిది. షూటింగ్ చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఏ రోజైనా షూటింగ్ లేదంటే నాకు బోర్ అనిపిస్తుంది. అంతగా ప్రొఫెషన్ అంటే నాకు ప్రేమ’’ అన్నారు కృతీ శెట్టి. నాగచైతన్య సరసన కృతీ నటించిన ‘కస్టడీ’ ఈ నెల 12న విడుదల కానుంది. పవన్‌కుమార్ సమర్పణలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు. ► ముందుగా ‘కస్టడీ’ స్టోరీ లైన్ గురించి.. సాధారణంగా ఏ సినిమాలో అయినా విలన్ని చంపడం, ఓడించడం... కథ ఇలా ఉంటుంది. అయితే ‘కస్టడీ’లో మాత్రం విలన్‌ను కాపాడటానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. కొత్త స్టోరీ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► స్టోరీ లైన్ కొత్తగా ఉంది... మీ పాత్ర? ఇందులో నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశాను. సీరియస్‌గా నడుస్తున్న కథను నా పాత్ర బ్యాలెన్స్ చేయడమే కాకుండా స్క్రీన్ ప్లేలతో పాటు ప్రయాణం చేస్తుంది. నేనిప్పటివరకూ చేసిన సిని మాలన్నింట్లోకీ ఈ సినిమాలో చేసిన పాత్ర నిడివి ఎక్కువ. ► కానీ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా? అది కొంత నిజమే. అయితే ‘కస్టడీ’ యాక్షన్ సినిమా అయినప్పటికీ హీరోయిన్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువ. ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే.. వేరే సినిమాలకు డ్యాన్స్ప్రాక్టీస్ చేశాను. కానీ ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. అందుకే డైరెక్టర్ వెంకట్ ప్రభుగారితో ఈ సినిమా చూశాక హాలీవుడ్ నుంచి నాకు మార్వెల్ ఫిలింస్‌కి, డిస్నీ సంస్థ నుంచి ఫోన్ వస్తుందేమో అని సరదాగా అన్నాను. ► ‘కస్టడీ’లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ చిత్రీకరణ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఈ యాక్షన్ సీన్స్ తీయడానికి 15 రోజులు పట్టింది. ఇందులో 5 రోజులు పూర్తిగా 20 ఫీట్ల వాటర్ పూల్‌లో షూటింగ్ చేశాం. తీసే ముందు రెండు రోజులుప్రాక్టీస్ చేశాం. కొన్నిసార్లు 40 సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఊపిరి తీసుకోకుండా చేయాల్సి వచ్చింది. ఈ సీన్లలో చైతూ, సంపత్‌గారు, అరవింద్ స్వామిగారు, నేను ఉంటాం. అందుకే భయం వేసింది. ఎందుకంటే ఎవరికి ‘అన్ ఈజీ’గా అనిపించినా మళ్లీ సీన్ తీయాల్సి ఉంటుంది. నా కారణంగా అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని కోరుకున్నాను. ► ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్యతో ‘కస్టడీ’ సినిమా చేశారు.. మీ కెమిస్ట్రీ గురించి? చైతన్య నా ఫేవరెట్ కో–స్టార్, అలాగే తన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. జనరల్‌గా ఆఫ్ స్క్రీన్‌లో కో–స్టార్స్ మధ్య మంచి రిలేషన్ ఉంటే అది ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆఫ్ స్క్రీన్ చై, నా రిలేషన్ బాగుంటుంది. తనతో ఉన్న సాన్నిహిత్యం మా కెమిస్ట్రీని మరింత అందంగా పండించింది. కొన్నిసార్లయితేప్రాక్టీస్ చేయకుండానే సహజంగానే నటించాం. చైతూతో ఆ కంఫర్ట్ ఉంటుంది. ► ‘ఉప్పెన’ తర్వాత మీరు చేసిన సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితం సాధించలేదు. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకున్నారా? ‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ వంటి మంచి సినిమాలు చేశాను. ఆ విషయం పక్కన పెట్టి ఫలితం గురించి చె΄్పాలంటే.. పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న నటులు ఉన్నారు. అయితే వారితో పాటు సక్సెస్ రెసిపీ ఎవరికీ తెలియదు. అది తెలిస్తే అన్నీ హిట్లే వస్తాయి. మా వంతుగా మేం చేయగలిగింది కష్టపడి పని చేయడమే. నేను చేసిన సినిమా ఫ్లాప్ అయినా పశ్చాత్తాపపడను. ఎందుకంటే ఆ సినిమా కూడా ఎంతో కొంత అనుభవాన్ని మిగుల్చు తుంది కదా. ఆ అనుభవం నా భవిష్యత్ సినిమాల ఎంపికకు పనికొస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ► నటన కాకుండా మీకున్న వ్యాపకాలు? దర్శకత్వం చేయాలనుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్షన్‌కి సంబంధించిన విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటాను. సెట్స్‌లో అందరూ ఆటపట్టిస్తుంటారు.. అయితే పదేళ్ల తర్వాతే డైరెక్షన్ చేస్తాను. ► తదుపరి సినిమాల గురించి... మలయాళంలో ఒక సినిమా, శర్వానంద్‌తో తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను.