‘‘మలయాళం మూవీ ‘నాయట్టు’ స్ఫూర్తితో ‘కస్టడీ’ స్టోరీలైన్ రాసుకున్నాను. అయితే ‘నాయట్టు’లో కమర్షియల్ అంశాలు ఉండవు. ‘కస్టడీ’లో తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కమర్షియల్ అంశాలు ఉంటాయి’’ అన్నారు వెంకట్ ప్రభు. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకట్ ప్రభు చెప్పిన విశేషాలు.
►ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ శివ పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. శివకు ఉన్న ప్రాబ్లమ్స్‌తో ఈ సినిమా కథ మొదలవుతుంది. అతని కుటుంబం, ప్రేయసి వంటి అంశాలతో మొదటి ఇరవై నిమిషాలు గడుస్తాయి. కానీ తనది కాని సమస్యలో శివ ఇరక్కుంటాడు. కాలానికి వ్యతిరేకంగా పరిగెత్తాల్సి వస్తుంది.
(చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్)
ప్రీ ఇంట్రవెల్ నుంచి క్లయిమాక్స్ వరకూ ఆడియన్స్ ఈ సినిమాను ఆసక్తికరంగా చూస్తారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. రీసెంట్‌గా ‘కస్టడీ’ స్టోరీ లైన్ చెప్పేశాను. ఆ తర్వాత సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయవద్దని, సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ను థియేటర్స్‌లో ఆడియన్స్ చూసి ఎగ్జయిట్ అయితే బాగుంటుందని చైతూ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. సో.. ఇంతకంటే ఏమీ చెప్పలేను.
(చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?)
► యాక్టింగ్ పరంగా ఈ చిత్రంలో కొత్త చైతూను చూస్తారు. రేవతిగా కృతీ శెట్టి, రాజుగా అరవింద్ స్వామి, శరత్‌కుమార్‌ల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘కస్టడీ’ యూనివర్సల్ సబ్జెక్ట్. సబ్ టైటిల్స్‌తో ఇతర భాషలవారు ఈ సినిమాను చూస్తే వారికీ నచ్చుతుంది. ఇక ‘మానాడు’ సినిమాను తెలుగులో శ్రీనివాసా చిట్టూరిగారు నిర్మించాల్సింది కానీ కుదర్లేదు. అయితే ఆయనతో ఓ ప్రాజెక్ట్ చేయాలన్న ఆశ ‘కస్టడీ’తో తీరింది. ‘కస్టడీ’ సినిమాకు ఇళయరాజాగారు, యువన్‌ల సంగీతం చాలా పెద్ద ఎస్సెట్
► నేను శివ సినిమాకి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు అందులో పాత్ర పేరు శివ అయినప్పుడు అదే పేరు పెట్టాలని అనుకున్నాను. అయితే చైతు వద్దు అని చెప్పారు. అది కల్ట్ క్లాసిక్. చాలా పోలికలు వస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment