![Custody Movie First Day Box Office Collection - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/13/custody.jpg.webp?itok=42Zi6Zpt)
నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
(చదవండి: కస్టడీ మూవీ రివ్యూ)
భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఫలితంగా తొలి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది.
(చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్‌ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్ )
ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు దాదాపు రూ.4 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో రూ.2.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment