‘‘నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కస్టడీ’ సినిమా రూపొందింది. నాగార్జునగారి కెరీర్‌లో ‘శివ’ మూవీ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్‌లో ‘కస్టడీ’ అలా గుర్తుండిపోతుంది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతితో పాటు ఓ మంచి చిత్రం చూశామనే సంతృప్తిని ప్రేక్షకులకు ‘కస్టడీ’ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు–తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.
(చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!)
ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘మన తెలుగు దర్శకులు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో ‘వారియర్’, ‘కస్టడీ’ సినిమాలను తమిళ డైరెక్టర్స్‌తో తీశాను. ‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయాలనుకున్నాను.. అది ‘కస్టడీ’తో కుదిరింది. ఒక కానిస్టేబుల్ కథ ఇది. మంచి కథ, చక్కని స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, సీరియస్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథ సాగుతుంది.
(చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఈ కథ వినగానే ఇళయరాజాగారు, యువన్ సంగీతం అందిస్తామనడం హ్యాపీ. ఈ మూవీ హిట్టవుతుందనే నమ్మకంతోనే ‘కస్టడీ 2’ ఉంటుందని చెబుతున్నాం. నేను ‘యు టర్న్’ తీసేనాటికి సమంతగారి మార్కెట్ ఏంటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. అలాగే గోపీచంద్ ‘సీటీమార్’, రామ్ ‘వారియర్’, ఇప్పుడు నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాలు కూడా వారి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ సినిమాలు. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. మా బ్యానర్‌లో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 90 శాతం పూర్తయింది. అలాగే నాగార్జునగారితో తీసే సినిమా షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించాలని అనుకుంటున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment