Srinivasa Chitturi
-
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్‌తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్‌గారు డైరెక్టర్‌గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్. -
కథ విన్నారా?
హీరో నాగార్జున, తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసి, ఓ కథ వినిపించారట నవీన్. స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు పూర్తిస్థాయిలో మెరుగులుదిద్దే పనిలో నవీన్ ఉన్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. అంతేకాదు.. నాగార్జున కెరీర్లో ఇది వందో చిత్రమట. మరోవైపు ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్నారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘నా సామిరంగ’ విడుదల కానుంది. -
యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది
‘‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ‘స్కంద’. ఇందులో నా పాత్రలో సరదా, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. కాలేజ్ డ్రామా కూడా ఉంది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్‌ని అద్భుతంగా చూపించడంలో బోయపాటిగారి మార్క్ కనిపిస్తుంది. ‘స్కంద’ చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది’’ అని శ్రీ లీల అన్నారు. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీ లీల చెప్పిన విశేషాలు. ► ‘స్కంద’లో నా పాత్రలో మాస్, క్లాస్ రెండూ మిక్స్ అయ్యుంటాయి. ఇందులో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ సీన్స్. ► ధమాకా’లో నా డ్యాన్స్‌లకు అంత పేరు వస్తుందనుకోలేదు. ‘స్కంద’ పాటల్లో మాస్, వెస్ట్రన్ డ్యాన్సులు అలరిస్తాయి. రామ్‌గారి డ్యాన్స్‌ని మ్యాచ్ చేయడం కష్టం. శ్రీనివాసా చిట్టూరిగారు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మించారు. ‘స్కంద’ బోయపాటిగారి మార్క్‌లో గ్రాండ్‌గా ఉంటుంది. ఇంత మాస్ యాక్షన్ సినిమా చేయడం నాకిదే తొలిసారి. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడం కూడా మొదటిసారే. ► ‘పెళ్లి సందడి’ తర్వాత ‘స్కంద’తో పాటు మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానమే. ఆ ప్రేమను మంచి సినిమాలు చేయడం ద్వారా తిరిగి ఇవ్వాలన్నదే నా తపన. -
'గందార బాయి' అంటూ.. రెచ్చిపోయిన రామ్
రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఎస్ఎస్ తమన్ స్వర పరచిన ‘స్కంద’లోని ‘గందార బాయి..’ అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్, సౌజన్య భాగ వతుల పాడారు. ‘‘ఈ పాటలో రామ్ డ్యాన్స్‌లో డైనమిజమ్ చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, కెమెరా: సంతోష్ డిటాకే. -
అజయ్ దర్శకత్వంలో..?
గత ఏడాది అక్టోబరులో ‘ది ఘోస్ట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు నాగార్జున. ఆ తర్వాత తదుపరి చిత్రం గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కథలు వింటూ బిజీగా ఉన్నారు. దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ వంటివారు నాగార్జునకు కథలు వినిపించారట. అయితే ఏదీ ఫైనలైజ్ కాలేదని సమాచారం. తాజాగా నాగార్జునకు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఓ కథను వినిపించారని, ఈ కథ ఆయనకు నచ్చిందని, త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందనీ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని తెలిసింది. -
శివలా ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది : శ్రీనివాసా చిట్టూరి
‘‘నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కస్టడీ’ సినిమా రూపొందింది. నాగార్జునగారి కెరీర్లో ‘శివ’ మూవీ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్లో ‘కస్టడీ’ అలా గుర్తుండిపోతుంది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతితో పాటు ఓ మంచి చిత్రం చూశామనే సంతృప్తిని ప్రేక్షకులకు ‘కస్టడీ’ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు–తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. (చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!) ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘మన తెలుగు దర్శకులు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో ‘వారియర్’, ‘కస్టడీ’ సినిమాలను తమిళ డైరెక్టర్స్‌తో తీశాను. ‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయాలనుకున్నాను.. అది ‘కస్టడీ’తో కుదిరింది. ఒక కానిస్టేబుల్ కథ ఇది. మంచి కథ, చక్కని స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, సీరియస్, ఎంటర్టైన్మెంట్తో కథ సాగుతుంది. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఈ కథ వినగానే ఇళయరాజాగారు, యువన్ సంగీతం అందిస్తామనడం హ్యాపీ. ఈ మూవీ హిట్టవుతుందనే నమ్మకంతోనే ‘కస్టడీ 2’ ఉంటుందని చెబుతున్నాం. నేను ‘యు టర్న్’ తీసేనాటికి సమంతగారి మార్కెట్ ఏంటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. అలాగే గోపీచంద్ ‘సీటీమార్’, రామ్ ‘వారియర్’, ఇప్పుడు నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాలు కూడా వారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమాలు. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. మా బ్యానర్లో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 90 శాతం పూర్తయింది. అలాగే నాగార్జునగారితో తీసే సినిమా షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించాలని అనుకుంటున్నాం’ అన్నారు.