
గత ఏడాది అక్టోబరులో ‘ది ఘోస్ట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు నాగార్జున. ఆ తర్వాత తదుపరి చిత్రం గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కథలు వింటూ బిజీగా ఉన్నారు. దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ వంటివారు నాగార్జునకు కథలు వినిపించారట. అయితే ఏదీ ఫైనలైజ్ కాలేదని సమాచారం.
తాజాగా నాగార్జునకు ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఓ కథను వినిపించారని, ఈ కథ ఆయనకు నచ్చిందని, త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందనీ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment