Gandara Bai: Skanda Movie 2nd Song Launched - Sakshi
Sakshi News home page

'గందార బాయి' అంటూ.. రెచ్చిపోయిన రామ్‌

Published Sat, Aug 19 2023 4:21 AM | Last Updated on Sat, Aug 19 2023 10:38 AM

Skanda movie song launch - Sakshi

రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కానుంది. ఎస్‌ఎస్‌ తమన్‌ స్వర పరచిన ‘స్కంద’లోని ‘గందార బాయి..’ అంటూ సాగే రెండో పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌  చేశారు.

ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, నకాష్‌ అజీజ్, సౌజన్య భాగ వతుల పాడారు. ‘‘ఈ పాటలో రామ్‌ డ్యాన్స్‌లో డైనమిజమ్‌ చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్‌ చేసింది. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: జీ స్టూడియోస్‌ సౌత్, పవన్‌ కుమార్, కెమెరా: సంతోష్‌ డిటాకే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement