యాక్షన్‌ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది | Sreeleela Interesting Comments About Skanda Movie In Latest Interview, Deets Inside - Sakshi
Sakshi News home page

Skanda Movie: యాక్షన్‌ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది

Published Thu, Sep 28 2023 1:02 AM | Last Updated on Thu, Sep 28 2023 11:49 AM

Sree Leela Interview About Skanda Movie - Sakshi

‘‘యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్న సినిమా ‘స్కంద’. ఇందులో నా పాత్రలో సరదా, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. కాలేజ్‌ డ్రామా కూడా ఉంది. మాస్‌ ఎలిమెంట్స్, ఫైట్స్‌ని అద్భుతంగా చూపించడంలో బోయపాటిగారి మార్క్‌ కనిపిస్తుంది. ‘స్కంద’ చేస్తున్నప్పుడు యాక్షన్‌ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది’’ అని శ్రీ లీల అన్నారు.

రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. జీ స్టూడియోస్‌ సౌత్, పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీ లీల చెప్పిన విశేషాలు.

► ‘స్కంద’లో నా పాత్రలో మాస్, క్లాస్‌ రెండూ మిక్స్‌ అయ్యుంటాయి. ఇందులో కొన్ని సీన్స్‌ నా రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మాస్‌ సీన్స్‌.

► ధమాకా’లో నా డ్యాన్స్‌లకు అంత పేరు వస్తుందనుకోలేదు. ‘స్కంద’ పాటల్లో మాస్, వెస్ట్రన్‌ డ్యాన్సులు అలరిస్తాయి. రామ్‌గారి డ్యాన్స్‌ని మ్యాచ్‌ చేయడం కష్టం. శ్రీనివాసా చిట్టూరిగారు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మించారు. ‘స్కంద’ బోయపాటిగారి మార్క్‌లో గ్రాండ్‌గా ఉంటుంది. ఇంత మాస్‌ యాక్షన్‌ సినిమా చేయడం నాకిదే తొలిసారి. అలాగే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం కూడా మొదటిసారే.

► ‘పెళ్లి సందడి’ తర్వాత ‘స్కంద’తో పాటు మరో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీ, ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానమే. ఆ ప్రేమను మంచి సినిమాలు చేయడం ద్వారా తిరిగి ఇవ్వాలన్నదే నా తపన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement