Naga Chaitanya Custody Movie OTT Release Date Confirmed, Check OTT Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Custody Movie In OTT: ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ‍ప్రకటించిన అమెజాన్‌ ప్రైమ్‌, స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?

Published Wed, Jun 7 2023 4:40 PM | Last Updated on Wed, Jun 7 2023 6:02 PM

Naga Chaitanya Custody OTT Release Date Out - Sakshi

అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతీ శెట్టి కథానాయికగా నటించిన చిత్రం కస్టడీ. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారి పోలీసాఫీసర్‌గా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే అండర్‌వాటర్‌ యాక్షన్‌ సీన్‌, ట్రైన్‌ ఫైట్‌, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ సీన్‌కు మాత్రం మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. శరత్‌ కుమార్‌, ప్రియమణి, అరవింద స్వామి తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

చదవండి: రెండో పెళ్లిపై ట్రోల్స్‌.. స్పందించిన ఆశిష్‌ విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement