
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అక్కినేని నాగచైతన్యతో కలసి నటించిన 'కస్టడీ' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది కృతిశెట్టి.
హీరోల్లో రామ్‌చరణ్, శివకార్తికేయన్ తన ఫేవరెట్ అని, ఆలియాభట్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ కాబోయేవాడు ఎలా ఉండాలో కూడా చెప్పేసింది. తన కాబోయే భర్తకు పెద్దగా ఆస్తి ఉండక్కర్లేదట ..అందంగా కూడా ఎక్కువగా ఉండక్కర్లేదట.
మంచి మనసున్నవాడై ఉండాలట. మొహమాటం లేకుండా నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తపరచాలట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో చాలా సింపుల్‌గా ఉండాలట. అంతేకాకుండా కాస్త బొద్దుగా కూడా ఉంటే ఇంకా ఇష్టమని తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది కృతిశెట్టి.
Comments
Please login to add a commentAdd a comment