అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం 'కస్టడీ'. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.
(ఇది చదవండి: అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్)
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై యావరేజ్ టాక్ రావడంతో త్వరలోనే ఓటీటీకి వచ్చేస్తుందని సినీప్రియులు భావిస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ రానుందని సమాచారం. ఎందుకంటే ఇటీవలే విడుదలైన రావణాసుర, శాకుంతలం సినిమాలు నెల ముందుగానే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: Custody Review: ‘కస్టడీ’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment