మా డాడీ వెరీ నైస్. మా ఇద్దరికి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉంటుందని అంటోంది సొట్టబుగ్గల భామ కృతీ శెట్టి. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రి గురించి కృతి ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు?
షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావడంతో మా డాడీ కోసం ముంబై వచ్చాను. మా డాడీకి స్వీట్స్ అంటే ఇష్టం. ఈ ఫాదర్స్ డేకి నాన్న కోసం కేక్ ఆర్డర్ చేశాను. డాడీకి షూస్ అంటే చాలా ఇష్టం. అవి కొన్నాను.
మీ నాన్నని సంతోషపెట్టే విషయం?
‘నేనే’. కూతురు ఉంటే చాలు ఆయనకు.
మీపట్ల మీ డాడీ తీసుకునే కేర్ గురించి?
అమ్మానాన్న ఇద్దరూ జాబ్ చేసేవారు. నేను స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. ‘స్కూల్ నుంచి వచ్చేశావా’ అని రోజూ ఇద్దరూ ఫోన్ చేసేవారు. తినడానికి ఏమైనా రెడీగా ఉంచేవారు. ఏ డ్రెస్ వేసుకోవాలో రెడీగా పెట్టేవారు. ట్యూషన్‌కి వెళ్లే ముందు ఫోన్ చేసేవారు. డాడీ చాలా కేరింగ్. ఒక్కోసారి డాడీ స్కూల్‌కి వచ్చి పికప్ చేసుకుని, రెస్టారెంట్‌కి తీసుకెళ్లేవారు. ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్లం. డాడీ నన్ను వదిలి ఉండేవారు కాదు.
మరి.. షూటింగ్స్‌కి మీతో పాటు వస్తుంటారా?
వస్తారు కానీ ఓ 15 నిమిషాల తర్వాత ఆయనకు బోర్ కొట్టేస్తుంది. డాడీకి సినిమాలంటే ఇష్టమే కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఓపిక తక్కువ. నేను, అమ్మ హైదరాబాద్‌లో ఉంటున్నాం. డాడీకి వర్క్ ఉంది కాబట్టి ముంబైలో ఉంటారు. నన్ను వదిలి ఒక్క 20 రోజులు ఉండగలరు. ఆ తర్వాత డాడీకి బెంగగా ఉంటుంది.. నాకూ అలానే ఉంటుంది.
మీ డాడీ చాలా కేరింగ్ అన్నారు. జనరల్‌గా అమ్మాయిలకు చెప్పే జాగ్రత్తలు చెబుతుంటారా?
మా డాడీ వెరీ నైస్. ఎందుకంటే ‘అమ్మాయివి కదా అలా ఉండకూడదు.. ఇలా ఉండాలి’ అని ఎప్పుడూ అనలేదు. ‘నువ్వు అమ్మాయివి కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉండాలి. భయపడుతూ ఉండక్కర్లేదు’ అని అంటుంటారు. ఆ మాటలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంటాయి.
మీరు అలిగినప్పుడు నవ్వించడానికి మీ నాన్నగారు, మీ నాన్నకి కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు?
యాక్చువల్లీ మా ఇద్దరికీ కోపమే రాదు. మాది ‘ఫ్రెండ్లీ కామెడీ రిలేషన్‌షిప్’. ఫలానా టైమ్‌లో నాన్న నన్ను కోప్పడ్డారు అని చెప్పడానికి నా లైఫ్‌లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. అలానే నేను అలిగిన సందర్భాలూ లేవు. చెప్పాలంటే నాన్న నాకంటే కూల్.
ఎగ్జామ్స్‌లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడో, అల్లరి చేసినప్పుడో మందలించలేదా?
నాకెప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. అల్లరి పిల్లని కూడా కాదు.
మీ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
‘బుంగీ’ అని పిలుస్తారు.
బుంగీ అంటే అర్థం?
అర్థం లేదు. ముద్దుగా అలా అంటారు.
లైఫ్‌లో డల్ మూమెంట్స్ సహజం. అలాంటి టైమ్‌లో మీ నాన్న మిమ్మల్ని ఎలా ఓదార్చుతారు?
‘నీకు లైఫ్‌లో బాధ పడే క్షణాలు లేకపోతే ఆనందం విలువ తెలియదు. అందుకని కొన్ని బాధలు ఉండాలి. ఆ బాధను పాజిటివ్‌గా తీసుకుని అధిగమించాలి’ అని మా డాడీ అంటుంటారు. అందుకే ఏదైనా చిన్న చేదు అనుభవం ఎదురైనా పాజిటివ్‌గా తీసుకుంటాను.
మీ తండ్రీకూతుళ్లలో ఉన్న కామన్ క్వాలిటీస్?
ఇద్దరికీ ఫుడ్ అంటే ఇష్టం. అది కూడా ఫాస్ట్ ఫుడ్. లిమిట్ లేకుండా లాగించేస్తాం. అలాగే ఇద్దరికీ కామెడీ చాలా ఇష్టం. పాత హిందీ సినిమా పాటలను ఇష్టపడతాం. ఇద్దరం కలిసి వింటాం.
ఒక్క సినిమా (ఉప్పెన)తోనే మీరు స్టార్ హీరోయిన్ కావడంపట్ల మీ నాన్న చాలా ఆనందపడి ఉంటారు.. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ కాబట్టి హీరోయిన్ అవుతానంటే మీ నాన్నగారు ఏమన్నారు?
అమ్మానాన్న నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ అంటే ఇద్దరికీ మంచి అభిప్రాయం ఉంది. ‘మనం మంచి పనులు చేస్తే మనకు అంతా మంచే జరుగుతుంది’ అని మా డాడీ అంటారు. ఆ మంచి పనులు చేయడంవల్లే నాకు మంచి జరిగిందని నమ్ముతాను. నా కెరీర్ మంచి షేప్ తీసుకున్నందుకు నాన్న చాలా హ్యాపీ. ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఆయనకు ఉంది (నవ్వుతూ).
మీ డాడీ విషయంలో మీరు ప్రౌడ్‌గా ఫీలయ్యేది?
మా డాడీ అంత మంచి మనిషిని చూడలేదు. సమాజానికి తిరిగి ఇవ్వాలంటారు. పాజిటివ్ పర్సన్. నన్ను కూడా హెల్ప్ చేయమని అంటుంటారు. ఇంత మంచి లక్షణాలున్న వ్యక్తి కాబట్టి డాడీని చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న ఎప్పుడూ ఇంతే హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment