మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాటను రిలీజ్ అయింది.
జల జల జలపాతం అంటూ సాగే పాటను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా జస్‌ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది.
|
Comments
Please login to add a commentAdd a comment