హీరో సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తాడు. ఇందులో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతమందిస్తున్న దేవీశ్రీప్రసాద్ ‘ధక్ ధక్ ధక్’ సాంగ్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. రచయిత చంద్రబోస్ తన లిరిక్స్‌లో ప్రేమ పదనిసలు ఒలికించగా సింగర్స్ శరత్ సంతోష్, హరి ప్రియ అద్భుతంగా ఆలపించారు. ‘నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్.. మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్..’ అంటూ సాగే ఈ పాటను ఇప్పటివరకు యూట్యూబ్‌లో పదకొండు లక్షల మందికి పైగా వీక్షించారు. (కాకినాడలో ఉప్పెన!)
ఉప్పెన చిత్రం నుంచి జాలువారిన ‘నీ కన్ను నీలి సముద్రం..’ యువత గుండెల్లో రింగురింగుమని మోగుతోంది. అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథతో తెరకక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు నాడు హీరోహీరోయిన్ల లుక్స్‌ను విడుదల చేయగా అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో హీరోయిన్ నవ్వుకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో.. ‘ఈ హీరోయిన్ నవ్వులో ప్రియా వారియర్‌ను మించిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (నీ కన్ను నీలి సముద్రం..)
Comments
Please login to add a commentAdd a comment