పంజా వైష్ణవ్‌ 'కొత్తగా లేదేంటి?' ఫుల్‌ సాంగ్‌ విన్నారా? | Ranga Ranga Vaibhavanga: Kothaga Ledhenti Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్‌, కేతిక శర్మల కొత్తగా లేదేంటి? ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది!

Published Sun, May 8 2022 1:43 PM | Last Updated on Sun, May 8 2022 1:43 PM

Ranga Ranga Vaibhavanga: Kothaga Ledhenti Lyrical Song Out Now - Sakshi

‘ఉప్పెన’ ఫేమ్‌ వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వం వహించారు. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించారు. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే లవ్‌ డ్యూయెట్‌ సాంగ్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. శ్రీమణి రాసిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్, హరిప్రియ పాడారు. ఈ పాట ప్రేమికులకు కనెక్ట్‌ అయ్యేలా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.

చదవండి:  రిపీట్‌ ఆడియన్స్‌ ఉంటారు.. రాసి పెట్టుకోండి

 ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌తో పాటు మరో హీరోయిన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement