ప్రతి ఏటా టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్స్ పరిచమవుతుంటారు. వారిలో కొంతమంది తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంటారు. మరికొందరు ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి వెళ్లిపోతుంటారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్‌కి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అలా 2021లో తెలుగు తెరను పలకరించిన కొత్త అందాలు ఏంటి? ఎక్కువ మందిని ఆకర్షించిన కొత్త భామలెవరు? ఓ లుక్కేద్దాం.
ఉప్పెనలా వచ్చి.. సముద్రమంత ప్రేమను పంచి..
తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు, సుదీర్ బాబు సినిమా, అలాగే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తుంది.
టాలీవుడ్ బ్యూటిరత్నం.. ‘చిట్టి’
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల విడుదలైన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో కనిపించి సందడి చేసింది.
ప్రస్తుతం నాగార్జున సరసన ‘బంగార్రాజు’లో ఓ ప్రత్యేక గీతంలో చిందులు వేయనుంది. అలాగే విష్ణు హీరోగా తెరకెక్కనున్న ‘డి అండ్ డి’లో సందడి చేయనుందని సమాచారం.
‘రొమాంటిక్’చూపులతో..
డాష్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది ముద్దుగుమ్మ కేతిక శర్మ. తొలి సినిమాతోనే తనదైన అందాలతో కుర్రకారు చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ షూటింగ్‌లో ఉండగానే.. నాగశౌర్య‘లక్ష్య’మూవీలో చాన్స్ దక్కించుకుంది. తొలి మూవీలో ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసిన కేతికా.. ‘లక్ష్య’లో తనదైన నటనతో ఆకట్టుకుంది.
శ్రీలీల.. అందాల మాయ
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్న భామ శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల తన అందంతో అందరిని కట్టిపడేసింది. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.. రవితేజ సరసన ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
‘చెక్’తో చెక్ పెట్టి..
కన్ను గీటుతో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. . నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్’తో మరోసారి ఆకట్టుకుంది. తేజ సజ్జా హీరోగా రూపొందించిన చిత్రమిది.. తాజాగా ఆమె కిట్ లో మరో మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు జమ అయ్యాయని తెలుస్తోంది. ఆ సినిమాల వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.
మీనాక్షి చౌదరి..
అక్కినేని సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా విడుదలకు ముందే రవితేజ సరసన ‘ఖిలాడి’లో అవకాశం దక్కించుకుంది. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2లో ఛాన్స్ కొట్టేసింది.
వీరితో పాటు మరికొంతమంది నటీమణులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ వివరాలు..
నవమి - నాంది
అమృత - రెడ్
శివానీ రాజశేఖర్ - అద్భుతం
లవ్లీసింగ్ - గాలి సంపత్
దియా మీర్జా - వైల్డ్ డాగ్
తాన్యా రవిచంద్రన్ - రాజా విక్రమార్క
గీత్ సైని - పుష్పక విమానం
కశిష్ ఖాన్ - అనుభవించు రాజా
వైశాలి రాజ్ - కనబడుట లేదు
మిశా నారంగ్ - తెల్లవారితే గురువారం
కృష్ణ ప్రియ - అర్ధ శతాబ్దం
ఆర్జవీ రాజ్ - వివాహ భోజనంబు
దృశ్య రఘునాథ్ - షాదీ ముబారక్
Comments
Please login to add a commentAdd a comment