ఉప్పెన రీమేక్‌లో స్టార్ హీరో త‌న‌యుడు | Vijay Son Jason Sanjay May Acting Debut With Uppena Tamil Remake | Sakshi
Sakshi News home page

వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్న‌ స్టార్ హీరో కొడుకు

Published Thu, Apr 23 2020 12:07 PM | Last Updated on Fri, Apr 24 2020 5:31 PM

Vijay Son Jason Sanjay May Acting Debut With Uppena Tamil Remake - Sakshi

హిట్ సాంగ్స్‌తో రిలీజ్‌కు ముందే క్రేజ్ సంపాదించుకున్న చిత్రం "ఉప్పెన"‌. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన‌ ఈ చిత్రం కరోనా విజృంభ‌ణ కార‌ణంగా వాయిదా ప‌డింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.. కృతీశెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యమ‌వుతోంది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ వార్త ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. దీని ప్ర‌కారం విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రం త‌మిళ రీమేక్ హ‌క్కులు కొన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఓ మంచి ప్రేమ క‌థ‌తో త‌న కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తున్న స్టార్ హీరో విజ‌య్‌కు క‌థ వినిపించిన‌ట్లు తెలుస్తోంది. (మనసు మనసు దగ్గరైతే ధక్‌ ధక్‌ ధక్‌)

ఈ సినిమాపై విజ‌య్ కూడా ఆస‌క్తి క‌న‌బర్చ‌గా, త‌న కొడుకు జాస‌న్ సంజ‌య్ విదేశాల నుంచి తిరిగి రాగానే మ‌రోసారి చ‌ర్చించి దాదాపు సినిమాకు ఓకే చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కెన‌డాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్న సంజ‌య్ అది పూర్త‌వ‌గానే ఈ సినిమాలో న‌టించే అవ‌కాశాలు‌న్నాయి. అయితే ప‌రిస్థితులు ఎక్క‌డిక‌క్క‌డ స‌ద్దుమ‌ణిగితే ఈ ఏడాది చివ‌ర్లో రీమేక్ ప‌ట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు త‌మిళ రీమేక్‌కు డైరెక్ష‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. క‌రోనా విల‌యం ముగిసిన త‌ర్వాతే ఈ రీమేక్‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. (కరోనా.. కొడుకు గురించి హీరో విజయ్‌ ఆందోళన!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement