ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల మనసు దోచుకున్న కృతిశెట్టి ఓవర్‌నెట్‌లో స్టార్‌డమ్ దక్కించుకుంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ హిట్స్‌తో రాకెట్‌లా దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వరుస ఫ్లాపులు కృతిని వెంటాడుతున్నాయి. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట
చివరగా ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ లిస్ట్‌లో చేరిపోవడంతో కృతి కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న కృతికి మరోవైపు ట్రోలింగ్ పేరిట విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ మధ్య కృతి ఫేస్‌లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ రూమర్స్‌పై స్పందిస్తూ.. 'ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్ మారుతాయి. అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా''? అంటూ బేబమ్మ ఫైర్ అయ్యింది. చదవండి: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్
Comments
Please login to add a commentAdd a comment