సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: కరోనాతో ఏడాదిగా సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో నష్టపోయిన తరుణంలో ‘ఉప్పెన’ సినిమా విడుదలవడం, అభిమానులు, ప్రేక్షకులు దానిని పెద్దహిట్ చేయడం తెలుగుసినీ ఇండస్ట్రీకి ప్రాణం పోసినట్టయ్యిందని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వీఎల్‌పురంలో మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్‌లో శ్రేయాస్ మీడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఉప్పెన’ సినిమా విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సారధ్యంలో ఒక్కొక్కపాట సినిమాకు ప్రాణం పోసిందన్నారు. విజయసేతుపతి, హీరోయిన్ కృతిశెట్టి వారి నటనతో ఆకట్టుకున్నారన్నారు. తొలి సినిమా ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మంచి దర్శకుడిగా, వైష్ణవ్‌తేజ్ మంచినటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. హీరో వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ హలో రాజమండ్రి, అందరికీ నమస్కారం బాగున్నారా.. మీరిచ్చిన సపోర్టుకు చాలా థ్యాంక్స్ అన్నారు.
Watch Aasi-Bebamma Dance For Nee Kannu Neeli Samudram #UppenaBlockbusterCelebrations
— BARaju (@baraju_SuperHit) February 17, 2021
Watch Live here - https://t.co/JhAdRek5XV#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/3IMsR44J5x
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ తన గురువు సుకుమార్, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్టు వల్లే ఉప్పెన సినిమా పెద్ద హిట్ సాధించిందన్నారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా ‘నీలిసముద్రం.. ప్రేక్షకుల మనస్సు అందులో పడవ ప్రయాణం’ అంటూ పాడి అలరించారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్‌లో ఉప్పెన సినిమా విజయోత్సవసభ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. హీరో రామచరణ్‌ను చిరంజీవి ఫ్యాన్స్ తరఫున యేడిద బాబి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. ముందుగా యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శ్రేయాస్ మీడియా సీఈవో శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్లు వింటేజ్ శివకుమార్, రామకృష్ణ, ఎల్‌వీఆర్, సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment