Ram Charan Comments On Vaishnav Tej Uppena Movie Teaser And Poster - Sakshi
Sakshi News home page

‘ఉప్పెన’టీజర్‌పై రామ్‌చరణ్‌ ఆసక్తికర ట్వీట్‌

Published Sat, Jan 16 2021 6:28 PM | Last Updated on Sat, Jan 16 2021 8:45 PM

Ram Charan Interesting Comments On Uppena Movie Teaser - Sakshi

మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉప్పెన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
 
తాజాగా ఉప్పెన టీజర్ చూసిన మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘టీజర్ చాలా బాగుంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుకు, నిర్మాణ సంస్థ మైత్రికి, ఇతర టెక్నీషియన్స్‌కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

ఇక ఈ మూవీలో త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించారు. శనివారం (జ‌న‌వ‌రి 16) ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్‌ సేతుపతి పెద్దమనిషి తరహాలో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఖద్దర్ చొక్కా, పంచె ధ‌రించిన విజ‌య్ సేతుప‌తి ఫోన్‌లో ఎవ‌రితోనో మాట్లాడుతూ క‌నిపిస్తున్నారు. ఆయ‌న మ‌రో చేతిలో న‌ల్ల క‌ళ్లద్దాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement