Uppena Actor Vaishnav Tej Movie With Jathi Ratnalu Director Anudeep KV - Sakshi
Sakshi News home page

‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్‌ సినిమా

Published Wed, Mar 17 2021 3:34 PM | Last Updated on Wed, Mar 17 2021 5:14 PM

Vaishnav Tej 3rd Movie With Jati ratnalu Director Anudeep kevi - Sakshi

డైరెక్టర్‌గా అనుదీప్ కేవీ‌, హీరోగా వైష్ణవ్‌ తేజ్‌ మొదటి సినిమాలతోనే టాలీవుడ్‌కు బ్లక్‌బస్టర్‌ హిట్‌ అందించారు. ఫుల్‌ లెన్త్‌ కామెడీగా అనుదీప్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుండగా, వైష్ణవ్‌ ‘ఉప్పెన’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్‌ రాబట్టి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ మూవీ సెక్సెస్‌లో మునిగి తెలుగుతూ ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు.

అయితే అనుదీప్‌-వైష్ణవ్‌ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ పడిందట. ఇప్పటికే నిర్మాత బీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఈ ప్రాజెక్ట్‌కు అడ్వాన్స్‌ కింద కొంత మొత్తం కూడా చెల్లించాడట. ప్రస్తుతం వైష్ణవ్‌ క్రిష్‌ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయిన వెంటనే అనుదీప్‌ వైష్ణవ్‌ మూడవ సినిమాను సట్స్‌పైకి తీసుకేళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 11న విడుదలై కలెక్షన్‌ వర్షం కురిపిస్తుండగా  ఇక ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ బ్లక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

చదవండి: 
అప్పుడే మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్‌
జాతి రత్నాలు ట్రైలర్‌ చూసి సరదాగా నవ్వుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement