డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్‌ప్రైజ్‌ | Chiranjeevi Special Gift To Uppena Actress Krithi Shetty And DSP | Sakshi
Sakshi News home page

డీఎస్పీకి చిరంజీవి ఖరీదైన కానుక

Published Mon, Feb 22 2021 2:20 PM | Last Updated on Mon, Feb 22 2021 4:49 PM

Chiranjeevi Special Gift To Uppena Actress Krithi Shetty And DSP - Sakshi

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ఉప్పెనతోనే రికార్డులు సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా హీరోలను సైతం షాక్‌కు గురి చేస్తూ బాక్సాఫీస్‌ దగ్గర ఉప్పెనలాంటి వసూళ్లను కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి అందరి చేత శభాష్‌ అనిపించుకుంది. ఇందులో నటించిన హీరోయిన్‌ కృతీ శెట్టికి ఇప్పటికే బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి.. కృతీ శెట్టిని, అభినందిస్తూ ఓ లేఖ పంపించాడు. బ్లాక్‌బస్టర్‌ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు లేఖతో పాటు ఓ ఖరీదైన బహుమతి అందించాడు. ఈ కానుకలు అందుకున్న ఈ ఇద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. 

చిరంజీవి రాక్‌స్టార్‌కు పంపిన లేఖలో "డియర్‌ డీఎస్పీ, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్‌ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో, చిత్రరంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావు. నీలో ఉండే నీ ఎనర్జీ సినిమాలకు, మ్యూజిక్‌కు ఇచ్చే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని రాసుకొచ్చారు.

చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్‌ ఎంట్రీ

2021ని ఇరగదీయాలని డిసైడ్‌ అయ్యాను: డీఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement