కాకినాడలో ఉప్పెన! | vaishnav tej uppena shooting in kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఉప్పెన!

Published Fri, Jun 7 2019 1:25 AM | Last Updated on Tue, Mar 10 2020 4:41 PM

vaishnav tej uppena shooting in kakinada - Sakshi

హెడ్డింగ్‌ చదివి కంగారు పడకండి. ఇక్కడ మేం చెబుతున్నది వెండితెర ‘ఉప్పెన’ గురించి. నటుడు చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన బుచ్చిబాబు సన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కాకినాడలో జరుగుతోంది.

ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్‌ మరో 30 రోజులు అక్కడే కొనసాగుతుంది. ఆ నెక్ట్స్‌ గ్యాంగ్‌టాక్, సిక్కిం ప్రాంతాల్లో 20 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. ఇక్కడ ఓ 20 రోజులు షూటింగ్‌ చేయనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అవుతుందని తెలిసింది. శ్యామ్‌ దత్‌ సైనుద్దీన్‌ కెమెరామేన్‌గా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement