![Jala Jala Jala Patham Lyrical Song - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/16/jala-jala.jpg.webp?itok=YgnXp1U4)
జల జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను
హే... మన జంటవైపు
జాబిలమ్మ తొంగి చూసెనే
హే... ఇటు చూడకంటూ
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే ‘‘జల జల‘‘
సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుందీ లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఎలాగ బైటపడుతోంది ఈవేళా
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను
నీ నుంచి నన్నూ తెంచలేదు లోకం ‘‘జల జల‘‘
ఇలాంటి తీపి రోజు
రాదు రాదు రోజూ
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు
తడపదంట ఒళ్లు
ఎలాగ దీన్ని గుండెల్లో దా^è డం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఏక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు
నీలోన నేను మనకు మనమే సొంతం ‘‘చలి చలి‘‘
చిత్రం : ఉప్పెన
రచన : శ్రీమణి
గానం : జస్‌ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment