తొలి సినిమాతోనే బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమాతో బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది ఈ మంగళూరు బ్యూటీ. ఉప్పెన సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ అంటూ సాగే.. పాట గుర్తుంది కదా.! ఈ పాటకు సినిమాలో నాట్యం చేసే ఛాన్స్ కృతిశెట్టికి దక్కలేదు. దీంతో శివరాత్రి సందర్భంగా ఈ పాటుకు స్పెషల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది కృతిశెట్టి. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సాంగ్‌లో పలికించిన హావభావాకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బేబమ్మ చాలా టాలెంటెడ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక చంద్రబోస్ రచించిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్‌గా మారిపోయిన కృతిశెట్టి..వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆఫర్‌ను దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా కృతీ శెట్టిని ఎంపిక చేయారని తెలుస్తోంది.
చదవండి : (రెమ్యునరేషన్ భారీగా పెంచిన ‘బేబమ్మ’.. మరీ అంతా!)
ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment