క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చి బాబు సన మొదటిసారిగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో పరిశ్రమలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయనకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి బుచ్చి బాబుకు భారీ స్థాయిలో బహుమతులు అందనున్న సంగతి తెలిసిందే. ‘డియర్ కామ్రేడ్’, ‘సవ్య సాచి’ చిత్రాల పరాజయం, ఆ తర్వాత లాక్‌డౌన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నష్టాలు చూడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో వారిని ‘ఉప్పెన’ లాభాల బాట పట్టించడంతో నిర్మాతలు బుచ్చిబాబును ఇళ్లు కావాలో, కారు కావాలో నిర్ణయించుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేగాక ఆయనతో పనిచేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారంట. ఇప్పటికే కింగ్ నాగార్జున తన తనయుడు అఖిల్ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్దచేయమని బచ్చిబాబుకు ప్రపోజల్ పెట్టినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘నాన్నకు ప్రేమతో..’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ఈ సమయంలో యంగ్ టైగర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారంట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బుచ్చిబాబుతో మూవీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీని కూడా మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జేత్ ఈ చిత్రాన్ని బుచ్చిబాబు రూపొందించనున్నట్లు సమచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాలి మరి.
(చదవండి: Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!)
(మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!)
Comments
Please login to add a commentAdd a comment