Viral: Google Showing Two Heroines For Krithi Shetty Name, Fans Got Confused - Sakshi
Sakshi News home page

కృతిశెట్టి ఫ్యాన్స్‌ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న గూగుల్‌

Published Tue, Mar 30 2021 2:28 PM | Last Updated on Tue, Mar 30 2021 5:47 PM

Viral: Google Confuses Krithi Shetty Fans - Sakshi

తొలి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ సంపాదించుకుంది హీరోయిన్‌ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది ఈ బ్యూటీ. దీంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్‌ తికమకపెడుతుంది. కృతిశెట్టి పేరును గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే..ఆమె పేరు అద్వైతగా చూపిస్తుంది. అలాగే కృతిశెట్టి పేరుతో మరో హీరోయిన్‌ ప్రోఫైల్‌ ఓపెన్‌ అవుతోంది. అంతేకాకుండా అద్వైత ప్రొఫైల్‌లో ఆమె ఆరు తమిళ సినిమాల్లో నటించినట్లు చూపిస్తుంది.

నిజానికి ఉప్పెన ఫేం కృతి శెట్టికి హీరోయిన్‌గా ఇది  డెబ్యూ మూవీ. దీంతో ఇన్ని చిత్రాలలో ఎప్పుడు నటించిందని ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. దీంతో అసలు నిజమైన కృతిశెట్టి ఎవరు? ఈ అద్వైతకు ఉ‍ప్పెన ఫేం కృతి శెట్టి ఏమవుతారు అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి పేరుతో ఇంతకుముందు కూడా ఓ హీరోయిన్‌ ఉన్నారు. అయితే సినిమాల్లో పెద్దగా రాణించకపోవడంతో ఆమె తన పేరును అద్వైతగా మార్చుకుంది.

మొన్నటి ఉప్పెన ఫేం కృతిశెట్టికి వికీపీడియాలో ప్రొఫైల్‌ లేదు. దీంతో ఆమె పేరును సెర్చ్‌ చేస్తే అద్వైత ప్రొఫైల్‌ ఓపెన్‌ అయ్యేది. ప్రస్తుతం కృతి శెట్టి పేరున ప్రొఫైల్ క్రియేట్ అయినప్పటికీ ఆ పేరు సెర్చ్ చేస్తే మాత్రం రెండు ప్రొఫైల్స్‌, రెండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో గూగుల్‌ మమ్మల్పి కన్‌ఫ్యూజ్‌ చేసేస్తుందంటూ ఆమె ఫ్యాన్స్‌ తికమకపడుతున్నారు. ప్రస్తుతం కృతిశెట్టి నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌ సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుహీరో రామ్‌కు జోడీగానూ ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది. 

చదవండి : వైరల్‌ : 'బేబమ్మ' డ్యాన్స్‌ వీడియో చూశారా?
నితిన్‌ బర్త్‌డే వేడుకల్లో సింగర్‌ సునీత దంపతులు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement