mega brother nagababu responds mega heroes absence at uppena movie event - Sakshi
Sakshi News home page

అందుకే ‘మెగా’ హీరోలు‘ఉప్పెన’ ఈవెంట్‌కి రాలేదు : నాగబాబు

Published Tue, Feb 9 2021 6:46 PM | Last Updated on Tue, Feb 9 2021 7:32 PM

Nagababu Responds On Mega Heroes Absence Of Uppena Movie Event - Sakshi

మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేడుకకు చిరంజీవి తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. దానికి గల కారణమేంటో తెలియజేస్తూ మెగా బ్రదర్‌ నాగబాబు తన యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

‘వైష్ణవ్  ఇండస్ట్రీకి రాకముందు చదువుకుంటావా? లేక ఇండస్ట్రీకి వస్తావా? అని నేను చాలాసార్లు అడిగాను. కానీ.. ఏదీ కన్ఫర్మ్గా చెప్పకపోయేవాడు. ఓ సారి నేను సీరియస్గా సినిమాల్లోకి వస్తావా అని అడిగినా కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అలాంటిది.. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘ఉప్పెన’ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. మొత్తానికి.. వైష్ణవ్ సినిమాల్లోకే వచ్చాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. 

కళ్యాణ్ బాబు సూచనలతో థాయ్ బాక్సింగ్ నేర్చుకొని వచ్చాడు వైష్ణవ్ తేజ్. మంచి ఫిట్‌నెస్ ఉన్న కుర్రోడు. పైగా మంచితనం ఎక్కువ. మా నిహారికకు, వరుణ్ తేజ్‌కి వైష్ణవ్ అంటే చాలా ఇష్టం.  మా అన్నయ్య, తమ్ముడు కళ్యాణ్ బాబు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్స్ రీచ్ కావాలంటే వరుణ్ గానీ, తేజ్ గానీ, వైష్ణవ్ గానీ చాలా కష్టపడాలి.

ఇక ‘ఉప్పెన’ మూవీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్ననే చరణ్ వరుణ్ నిహారిక ఈ సినిమా చూశారు. చాలా బాగుందని చెప్పారు. కథ చాలా రియలిస్టిక్గా ఉంది వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలోనే చాలా బాగా నటించాడు.మొన్న జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా ఫ్యామిలీ నుంచి ఎవ్వరమూ అటెండ్ కాలేదు. ఇంటిల్లిపాది వెళ్లడం కంటే.. వాడిని వాడిగా ప్రొజెక్ట్ చేయాలనే అలా చేశాము. కాకపోతే.. మా అందరికీ పెద్ద దిక్కు కాబట్టి మా అన్నయ్యను పిలిచారు. ఆ రకంగా వైష్ణవ్‌ ఆయన బ్లెస్సింగ్స్ దక్కాయి. ఉప్సెన మంచి హిట్‌ అవుతుదంనే నమ్మకం ఉంది. వైష్ణవ్‌ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి’అని నాగబాబు చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement