హైదరాబాద్: 69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
తాజాగా.. రెండు రోజుల కిందట 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సుకుమార్‌డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ పార్ట్ 1 చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తొలి యాక్టర్‌గా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు అవార్డులతో రాజమౌళి మల్లీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నెగ్గింది. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment