
మెగాస్టార్ వారసుడిగా 'చిరుత'లా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేడు గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరుకోవడమే కాదు తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు

తన నటనతో 'రంగస్థలం'పై మెప్పించి ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా గుర్తింపు తెచ్చుకున్న 'చరణ్' వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు

అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది

వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది

ఈ ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది













