
టాలీవుడ్‌లో రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వైవాహిక బంధానికి నేటితో పదకొండేళ్లు నిండాయి.

జూన్ 14, 2012న చరణ్, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది.

ఈ క్షణ కోసం మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వీరికి పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించడంతో మరింత ఆసక్తి నెలకొంది.

రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేస్తుంటారు.

ఆ మధ్య జరిగిన ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లగా అక్కడికి కూడా ఈ దేవుళ్ల ఫోటోలను తీసుకెళ్లారు.

ఆస్కార్ వేడుకకు వెళ్లేముందు భగవంతుడికి పూజలు చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

'నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది' అని రామ్‌చరణే స్వయంగా చెప్పాడు.

ఇకపోతే మార్చిలో దుబాయ్ వెకేషన్ వెళ్లి ఉపాసన- చెర్రీ సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో బేబీ షవర్ వేడుక చేసుకున్నారు.

అనంతరం మాల్దీవుల్లో విహరించి హైదరాబాద్‌కు వచ్చేశారు.



ఏప్రిల్ నెలలో చిరంజీవి ఇంట మరోసారి ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు.