Vels University
-
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే
మెగాస్టార్ వారసుడిగా 'చిరుత'లా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేడు గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరుకోవడమే కాదు తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తన నటనతో 'రంగస్థలం'పై మెప్పించి ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా గుర్తింపు తెచ్చుకున్న 'చరణ్' వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ను సంపాదించుకున్న రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. అందులో రామ్ చరణ్‌తో పాటు డా.పి.వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చంద్రయాన్, ఇస్రో), డా.జి.ఎస్.కెవేలు (ఫౌండర్, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్), అచంట శరత్ కమల్ (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్)లను కూడా గౌరవించారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌరవంతో డాక్టరేట్ బహుకరించిన వేల్స్ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 45వేలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మగారు నమ్మలేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేషన్స్ మధ్యలో నేను ఈరోజు ఇలా ఉండటం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు దక్కిన గౌరవం నాది కాదు.. నా అభిమానులది, దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులది. వేల్స్ యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజమాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెన్నై నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్నగారు తన ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. నా సతీమణి ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనబై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలని కలలు కని చెన్నైకి వస్తే అది నేరవేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్పతనం. అన్ని రంగాల వారికి ఈ భూమి కలలను నేరవేర్చేదిగా ఉంటూ వస్తుంది. నేను ఇక్కడ విజయ హాస్పిటల్లోనే పుట్టి పెరిగాను. సినిమాల విషయానికి వస్తే ప్రముఖ డైరెక్టర్ శంకర్‌గారితో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాను. ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయనతో వర్క్ చేయటం మంచి ఎక్స్‌పీరియెన్స్. శంకర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డిఫరెంట్ స్టోరీతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ' అని అన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది: చిరంజీవి 'తమిళనాడులో ప్రసిద్ధ విద్యాసంస్థగా కొనసాగుతున్న వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఒక తండ్రిగా ఎమోషనల్‌గా ఫీల్ అవడమే కాకుండా.. గర్వంగా భావిస్తున్నాను. పిల్లలు విజయాలను అధిగమించినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరంగా విజయాలను అందుకుంటున్నాడు. లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్' అని మెగాస్టార్ తెలిపారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ప్రముఖ యూనివర్శిటీ ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ త్వరలో డాక్టరేట్ అందుకొనున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న చెన్నైలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సినీ నిర్మాత, యూనివర్శిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ ఆద్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. కళా రంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ అరుదైన గౌరవం తమ హీరోకు దక్కడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వేడుకల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. సినిమాల విషయానికొస్తే.. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో అంజలి, ఎస్.జె.సూర్య, జయరామ్, సునీల్, నాజర్, శ్రీకాంత్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో చరణ్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. -
సురేష్ రైనాకు అరుదైన గౌరవం..!
Suresh Raina Doctorate: టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా రైనా అభిమానులతో పంచుకున్నాడు. "ప్రతిష్టాత్మక వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చెన్నై నాకు సొంత ఇల్లు వంటింది. ఇది ఇప్పటికీ నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది" అని రైనా ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత రైనా ఐపీఎల్లో మాత్రం కొనసాగాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రైనా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. కాగా ఐపీఎల్-2022కు ముందు రైనాను చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా రీటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొన్నాడు. అయితే మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనాను ఐపీఎల్-2022 వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వేలంలో అమ్ముడుపోని రైనా ఐపీఎల్లో కామెంటేటర్‌గా సరికొత్త అవతరామెత్తాడు. ఇక భారత తరపున 18 టెస్టులు, 226 వన్డేలు,78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1605 పరుగులు సాధించాడు. I am humbled to receive this honour from the outstanding institution VELS Institute of Science & technology & Advanced Studies @VelsVistas @IshariKGanesh Sir. I am moved by all the love & thank you from the bottom of my heart. Chennai is home & it has a special place for me ❤️✨ pic.twitter.com/bZenkMwid8 — Suresh Raina🇮🇳 (@ImRaina) August 5, 2022 చదవండి: KL Rahul: వాళ్లు ఉన్నారుగా! మనకి కేఎల్ రాహుల్ అవసరమా?! అనిపించేలా.. -
తమిళ హీరో శింబుకు గౌరవ డాక్టరేట్, ఏ యూనివర్శిటీ ఇచ్చిందంటే
తమిళ స్టార్ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు స్యయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని, అందుకే ఈ గౌరవాన్ని వారిక అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అభిమానులకు ఈ సందర్భంగా శింబు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. దర్శకుడు, నటుడు టి. రాజేందర్ కుమారుడిగా బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు హీరోగా ఆకట్టుకున్నాడు. అంతేగాక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాట ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు శింబు. Thanking all the committee members of Vels University & @IshariKGanesh for bestowing the Honorary Doctorate upon me. I dedicate this huge honour to Tamil cinema, my Appa & Amma! Cinema happened to me because of them! Finally - my fans, #NeengailaamaNaanilla Nandri Iraiva! ❤️ pic.twitter.com/YIc6WyGCvR — Silambarasan TR (@SilambarasanTR_) January 11, 2022 -
పాప్ కింగ్‌కు పట్టం
వేల్స్లో మైఖెల్ జాక్సన్ విగ్రహం ప్రతిష్ట ఆవిష్కరించిన నటుడు ప్రభుదేవా విద్యార్థులతో సందడి మహదానందంగా ఉందని వ్యాఖ్య చెన్నై: పాప్ సంగీత ప్రపంచంలో రాజుగా వెలిగిన మైఖెల్ జాక్సన్‌కు వేల్స్ వర్సిటీ పట్టం కట్టింది. సంగీత ప్రియుల్ని ఓలలాడించిన పాప్‌కింగ్ నిలువెత్తు విగ్రహాన్ని తమ వర్సిటీలో ప్రతిష్టించింది. గురువారం జరిగిన వేడుకలో ఈ విగ్రహాన్ని ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా ఆవిష్కరించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ‘మైఖెల్ జాక్సన్’ అన్న ఆ పేరులోనే ఉంది ఓ వైబ్రేషన్. పాప్ సంగీత సామ్రాజ్యంలో గాయకుడిగా, నృత్యకారుడిగా ప్రపంచ స్థాయిలో పాప్ కింగ్‌గా అవతరించి అమరుడైన మైఖెల్ జాక్సన్‌ను స్మరిస్తూ వేల్స్ వర్సిటీ విగ్రహ ప్రతిష్టకు చర్యలు చేపట్టింది. ఇందుకు చెన్నైకు చెందిన ఆర్సీ గోల్డన్ గ్రానైట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చంద్రశేఖరన్ ముందుకు వచ్చారు. 3.5 టన్నుల గ్రానైట్ రాతితో ఏక శిలా విగ్రహం తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. శిల్పకళాకారుడు రమేష్ 40 రోజులు శ్రమించి మైఖెల్ జాక్సన్ నిలువెత్తు ఏకశిలా గ్రానైట్ విగ్రహానికి బెంగళూరులో రూపకల్పన చేశారు. రూ.12 లక్షల ఖర్చుతో పది అడగులు ఎత్తు, 5.5 అడుగుల వెడల్పుతో పాప్‌కింగ్ స్టెప్పులు వేస్తున్నట్టుగా విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి సైతం ఎక్కడం విశేషం. అలాంటి ఈ విగ్రహాన్ని పల్లావరం సమీపంలోని వేల్స్ వర్సిటీలో ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన వేడుకలో ఇండియన్ మైఖెల్ జాక్సన్, ప్రముఖ నటుడు, దర్శకుడు,నిర్మాత ప్రభుదేవా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహదానందం: ఈ విగ్రహావిష్కరణ అనంతరం మీడియాతో ప్రభుదేవా మాట్లాడుతూ చెన్నై వేల్స్ వర్సిటీలో విగ్రహం ఏర్పాటు చేశారన్న సమాచారంతో షాక్‌కు గురయ్యానని వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం తనకు ఈ సమాచారం తెలియగానే, ఎప్పుడెప్పుడు మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని చూస్తానో అన్న ఉత్సాహంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. అందుకే ఆ విగ్రహం తరహాలో నిలబడి తానూ ఫొటోకు ఫోజు ఇచ్చానని, ఆ ఫొటోను తన ఇంట్లో భద్ర పరచుకుంటానన్నారు. ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం మహదానందంగా ఉందన్నారు. ఇక, సినిమా విషయాలకు వస్తూ, తన సొంత బ్యానర్లో మూడు చిత్రాలు చేస్తున్నట్టు వివరించారు. వేల్స్ వర్సిటీ చాన్సలర్ డాక్టర్ ఐషరి కె గణేష్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఇక్కడకు విగ్రహాన్ని తీసుకొచ్చామని, దీనిని ఇండియన్ మైఖెల్ జాక్సన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలన్న సంకల్పంతో ముందుకు సాగామన్నారు. ప్రభు దేవా చెన్నైకు వచ్చిన సమాచారంతో ఆయన్న సంప్రదించగా తక్షణం అంగీకరించడం అభినందనీయంగా పేర్కొన్నారు. తమ వర్సిటీలో వేల్స్ నక్షత్ర పేరిట వేడుకలు జరిగాయని గుర్తు చేస్తూ, ఆ సమయంలో ఇక్కడ డ్యాన్స్, మ్యూజిక్ డిప్లొమో, డిగ్రీ కోర్సుల ఏర్పాటుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రముఖ లక్ష్మణ్ శ్రుతి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. శిల్పకళాకారుడు రమేష్ మాట్లాడుతూ మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని సిద్ధం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వీ చెన్నై వారియర్స్ పేరిట జరిగిన కార్యక్రమానికి హాజరైన వలంటీర్లకు ఈసందర్భంగా ప్రభుదేవా చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. తదుపరి ఆ వర్సిటీలోని విద్యార్థులతో ముచ్చటించే విధంగా కాసేపు అక్కడే ఆనందంగా ప్రభు దేవా గడిపారు. ప్రభుదేవా రాకతో ఆయన్ను చూడడానికి ఆ వర్సిటీలోని విద్యార్థులందరూ తరలి రావడం, సెల్ఫీల కోసం ఎగబడడంతో , వారిని కట్టడి చేయడం కష్టతరంగా మారిందని చెప్పవచ్చు.