తమిళ స్టార్ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు స్యయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు.
చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..
కాగా తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని, అందుకే ఈ గౌరవాన్ని వారిక అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అభిమానులకు ఈ సందర్భంగా శింబు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. దర్శకుడు, నటుడు టి. రాజేందర్ కుమారుడిగా బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు హీరోగా ఆకట్టుకున్నాడు. అంతేగాక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాట ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు శింబు.
Thanking all the committee members of Vels University & @IshariKGanesh for bestowing the Honorary Doctorate upon me.
— Silambarasan TR (@SilambarasanTR_) January 11, 2022
I dedicate this huge honour to
Tamil cinema, my Appa & Amma! Cinema happened to me because of them!
Finally - my fans, #NeengailaamaNaanilla
Nandri Iraiva! ❤️ pic.twitter.com/YIc6WyGCvR
Comments
Please login to add a commentAdd a comment