గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ త్వరలో డాక్టరేట్ అందుకొనున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న చెన్నైలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సినీ నిర్మాత, యూనివర్శిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ ఆద్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి.
కళా రంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ అరుదైన గౌరవం తమ హీరోకు దక్కడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వేడుకల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు.
సినిమాల విషయానికొస్తే.. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా హీరోయిన్‌గా నటిస్తుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో అంజలి, ఎస్.జె.సూర్య, జయరామ్, సునీల్, నాజర్, శ్రీకాంత్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో చరణ్ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment